»   » వెంకటేష్ గ్యాప్ లో ఏం చేస్తున్నారు? నిజం ఏంటి?

వెంకటేష్ గ్యాప్ లో ఏం చేస్తున్నారు? నిజం ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'గోపాల గోపాల' చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యినా ఆయన కొత్త చిత్రం మొదలెట్టలేదు. దాంతో ఆయన అభిమానులు అంతా ఈ సైలెన్స్ ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ మద్యకాలంలో వెంకటేష్ ఎప్పుడూ ఇలా ఇంత గ్యాప్ తీసుకుని ఆలోచనలో పడి నిర్ణయం తీసుకోలేదు. రెగ్యులర్ గా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడకపోవటం మీడియాని సైతం ఆశ్చర్యంలో పడేసింది. ఇంతకీ వెంకీ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు...ఏం చేసారు అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారం ప్రకారం...తన తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చారు.

Venkatesh tour to north India?

అలాగే ఆ సమయంలోనే రచయిత ఆకుల శివతో రాబోయే సినిమా స్క్రిప్టు డిస్కషన్‌లో వెంకటేశ్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఎలాంటి కథ, ఏ బ్యాగ్ డ్రాప్, ఎటువంటి పాత్ర లాంటి వివరాలు తెలియలేదు.

అలాగే... ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపించే వెంకటేశ్, ఈసారి బాగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తనయుడు అర్జున్ రామ్‌నాథ్‌తో కలిసి ఆ గెటప్‌లోనే సందడి చేశారు. ఈ గెడ్డం గెటప్ అంతా ఆ కొత్త సినిమా కోసమే అని అభిమానులు భావిస్తున్నారు.

ఆకుల శివ స్క్రిప్టుతో జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా వెంకీ కొత్త సినిమా మొదల వుతుందనేది ఫిలిమ్‌నగర్ టాక్. దర్శకుడు ఎవరనేది తెలియరావాల్సి ఉంది. 

English summary
Sources revel that venkatesh went North India after his father demise.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu