»   »  వెంకటేష్,క్రాంతి మాధవ్ చిత్రం టైటిల్ ఇదే

వెంకటేష్,క్రాంతి మాధవ్ చిత్రం టైటిల్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దృశ్యం,గోపాల గోపాల తర్వాత వెంకటేష్ గ్యాప్ తీసుకుని మరో చిత్రం కమిటయ్యిన సంగతి తెలిసిందే. సింహా చిత్రం బాలకృష్ణతో, షాడో చిత్రాన్ని వెంకటేష్ తో నిర్మించిన పరుచూరి ప్రసాద్ నిర్మాత. క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ చిత్రానికి ‘సంతోషం సగం బలం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా సాగనుందని తెలుస్తోంది. ఓ కొత్త తరహా కథాంశంతో దర్శకుడు వెంకటేష్ ని ఒప్పించినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వెంకటేష్‌ హీరో యునైటెడ్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. పరుచూరి ప్రసాద్‌ నిర్మాత. 'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో ఆకట్టుకొన్న క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహిస్తారు. ఇటీవల క్రాంతిమాధవ్‌ కథ చెప్పడం, వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయి. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

Venky-Kranthi Madhav film titled?

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించే అవకాశాలున్నాయని సమాచారం. 'లక్ష్మీ', 'తులసి' సినిమాలతో హిట్‌ పెయిర్‌ అనిపించుకొన్న జంట.. వెంకటేష్‌, నయనతార. వీళ్లిద్దరూ మళ్లీ వెండితెరపై సందడి చేస్తే హ్యాట్రిక్‌ కొట్టబోతున్నట్లే అంటున్నారు సినీ వర్గాలు.

ఇక ప్రస్తుతం తమిళంలో 'మాయ' చిత్రంలో నటిస్తోంది నయన. తెలుగులో 'మయూరి'గా విడుదల కాబోతోంది. 'అనామిక' తరవాత నయన చేస్తున్న తెలుగు చిత్రమిదే. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

English summary
Venkatesh agreed to the film under the production of United Movie Makers, who were the producers of his recent film,Shadow. This film was going to direct by Onamalu and Malli Malli Idhi Rani Roju director Kranthi Madhav and it was expected to start from 14th August. It is coming out that the film which is in pre-production is titled as ‘Santosham Sagam Balam’.
Please Wait while comments are loading...