Just In
Don't Miss!
- News
Terrace ladys: పెళ్లాం పుట్టింటికి, బాత్ రూమ్ లో టెర్రాస్ లేడీస్, మనోడికి రోజూ పండగే, లొట్టలు వేస్తే!
- Sports
రిషభ్ పంత్ ప్రమోషన్ వ్యూహం నాది కాదు.. ఆ ఘనత పూర్తిగా విరాట్ కోహ్లీదే: విక్రమ్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్- వెంకీ ‘మసాలా’ఆడియో విడుదల తేదీ
యంగ్ హీరోల్లో రామ్ పంథాయే వేరు. మాస్ చిత్రాల ద్వారా ఎనర్జిటిక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రేమకథా చిత్రాల్లో లవర్‌బోయ్‌గా యువతరం అభిమానాన్ని చూరగొన్నారు. 'దేవదాసు'చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రామ్ విభిన్న కథా చిత్రాల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాందించుకున్నారు. 'రెడీ', 'మస్కా', 'కందిరీగ' చిత్రాలు కమర్షియల్‌గా ఆయనకు మంచి విజయాల్ని సాధించిపెట్టాయి.
'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్. ఈ ఏడాది విడుదలైన 'ఒంగోలుగిత్త' ఆయనకు ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం రామ్ హిందీ సూపర్‌హిట్ చిత్రం 'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్‌లో వెంక కలిసి నటిస్తున్నారు.
మొదట ఈ చిత్రానికి 'గరమ్ మసాలా' అన్నారు. ఆ తరవాత అది 'గోల్ మాల్'గా సురేష్ బాబు చెప్పారు. ఈమధ్య 'బ్లాక్ బస్టర్' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇద్దరు హీరోలు కాబట్టి 'రామ్ బలరామ్' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ' మసాలా' హీరోలు ఇద్దరికి నచ్చిందని కాబట్టి అదే ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం టైటిల్ ఖరారు చేసి ప్రకటన చేసే అవకాసం ఉంది. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.