»   » గూఢచారి రామాచారికి కమిలినీ ముఖర్జీకి లింకేంటి?

గూఢచారి రామాచారికి కమిలినీ ముఖర్జీకి లింకేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గొపి..గోపిక..గోదావరి జంట వేణు,కమిలినీ ముఖర్జీ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ "రామాచారి..వీడు పెద్ద గూఢచారి" అని నిర్ణయించారని సమచారం. మళయాళ సూపర్ హిట్ సిఐడీ మూస చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక కమిలినీ ముఖర్జీ, వేణు లది హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం కూడా హిట్టయ్యే అవకాసం ఉందని నిర్మాతలు భావిస్తున్నామంటున్నారు. ఇక ఇది పూర్తి కామిడీ చిత్రం. దర్శకుడు ఈశ్వర్ గతంలో సీతారాముల కళ్యాణం..లంకలో, సిద్దు ప్రమ్ శికాకుళం చిత్రాలు నిర్మించారు. గతంలో స్వయంవరం', 'చిరునవ్వుతో', '10 క్లాస్', 'కళ్యాణరాముడు' తదితర చిత్రాలను నిర్మించిన ఎస్.పి.ఎంటర్ ‌టైన్ ‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మానందం, ఆలీ, కోట, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, గిరిబాబు, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు తదితరులు నటించే ఈ చిత్రానికి కథా విస్తరణ: ఎన్.వి.బి. చౌదరి, బి.సుమంత్, మాటలు: విక్రమ్‌ రాజ్, డుంగ్రోత్ నాగరాజు నాయక్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, నిర్మాత: పి.వి.శ్యామ్ ‌ప్రసాద్, దర్శకత్వం: జి.ఈశ్వర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu