»   » సాయి పల్లవితో ‘నీదీ నాదీ ఒకే కథ’ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్?

సాయి పల్లవితో ‘నీదీ నాదీ ఒకే కథ’ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sai Pallavi Next Movie With Needi Nadi Okate Katha Director

'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో దర్శకుడు వేణు ఉడుగుల పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన సినిమా తీశారనే ప్రశంసలు అందుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. శ్రీవిష్ణు హీరో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

కాగా... వేణు ఉడుగుల తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి లీడ్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Venu Udugula next film with Sai Pallavi

'ఫిదా', 'ఎంసీఏ' సినిమాల తర్వాత సాయి పల్లవి మరింత బిజీ అయ్యారు. ఆమె నటించి బైలింగ్వల్ మూవీ 'కణం' పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'ఎంజీకే', ధనుష్ 'మారి-2' చేస్తున్నారు. దీంతో పాటు తెలుగులో హను రాఘవపూడి ప్రాజెక్ట్ 'పడి పడి లేచే మనసు' చిత్రంలో నటిస్తోంది.

Venu Udugula next film with Sai Pallavi

ఇటీవలే వేణు ఉడుగుల సాయి పల్లవిని కలిసి కథ వివరిచారని, ఆమెకు స్టోరీ లైన్ నచ్చడంతో ఓకే చెప్పిందని, స్క్రిప్టు పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Needi Nadi Okate Katha movie getting good responce from all over telugu audience, The movie directed by Venu Udugula. Film Nagar source said that director's next film with Sai Pallavi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X