Yellamma: ఇదేం ట్విస్ట్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చెంతకి ఎల్లమ్మ ప్రాజెక్ట్.. హీరో అతడే?
Yellamma: 'బలగం'సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నటుడు, దర్శకుడు వేణు యెల్దండి. ఈ సినిమాతో ఎవరూ ఉహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి, కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అంచనాలకు మించి విజయం సాధించిన తర్వాత వేణు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. పెద్ద నిర్మాతలు, హీరోలు ఆయనతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, వేణు మాత్రం తన గురువు దిల్ రాజు బ్యానర్‌లోనే రెండో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా రూపొందిన కథే 'ఎల్లమ్మ'. అయితే.. తరుచుగా హీరోలు మారడంతో ఈ టాపిక్ టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. తాజాగా ఈ సినిమా కథానాయకుడిగా మరోకరి పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా లీడ్ రోల్ నటించేది ఎవరు?
2023లో విడుదలైన 'బలగం' సినిమాతో వేణు యెల్దండి దర్శకుడిగా తన సత్తా చాటారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో దర్శకుడు వేణు రెండో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్ కు 'ఎల్లమ్మ 'అనే పెట్టారు. కథ సిద్ధంగా ఉన్నా, హీరో మాత్రం ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. తరుచుగా హీరోలు మారడంతో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడం టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథానాయకుడి గా మరో నటుడి పేరు వినిపిస్తోంది.

మొదట ఈ కథను నానితో చేయాలని ప్లాన్ చేశారు. వేణు చెప్పిన స్టోరీ నానికి బాగా నచ్చిందట. దాంతో ఈ ప్రాజెక్ట్ నాని లైనప్‌లో ఎప్పుడు మొదలవుతుందనే చర్చ మొదలైంది. కానీ తరువాత అనుకోకుండా నాని ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా చేయలేనని చెప్పేసారు. హీరో నాని తప్పుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ నితిన్ చెంతకు చేరింది. నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే నితిన్ 'తమ్ముడు' సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పాటు, బడ్జెట్ ఇష్యూలు తలెత్తడంతో, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్ వచ్చింది.
తరువాత ఈ సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో 'అల్లుడు శీను - వేణు కాంబినేషన్‌లో ఎల్లమ్మ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది' అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ అది కూడా రూమర్‌గానే మిగిలిపోయింది. ఇదే సమయంలో, తాజాగా వినిపిస్తున్న పేరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట తెగ హాట్‌గా మారింది. వేణు యెల్దండి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'ఎల్లమ్మ'లో నటించబోతున్నారని టాక్. గతంలోనూ డీఎస్పీ హీరోగా నటిస్తారనే వార్తలు పలుమార్లు వినిపించాయి కానీ అవి నిజం కాలేదు. ఈసారి మాత్రం వేణు-దిల్ రాజు కాంబినేషన్‌లో ఇది నిజమవుతుందా? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. 46 ఏళ్ల వయసులో దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా ఎంట్రీ ఇవ్వడం నిజమైతే, అది టాలీవుడ్‌లో ఓ కొత్త చాప్టర్ అవుతుంది. మ్యూజిక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయనను ఇప్పుడు హీరోగా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, వేణు యెల్దండి రెండో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా, అసలు హీరో ఎవరనే ప్రశ్నకు ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ పేరు వెలుగులోకి రావడంతో 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఏదేమైనా, 'బలగం' తర్వాత వేణు యెల్దండి ఏ కథతో, ఏ హీరోతో తిరిగి వస్తారో తెలుసుకోవాలని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ 'ఎల్లమ్మ' సినిమా చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











