»   »  ఎన్టీఆర్...'జనతా గ్యారేజ్' లో: అల్లరి నరేష్ హీరోయిన్

ఎన్టీఆర్...'జనతా గ్యారేజ్' లో: అల్లరి నరేష్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ సరసన అత్తిలి సత్తిబాబు ఎల్ కే జి, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య, శ్రీకాంత్ దేవరాయ చిత్రాల్లో నటించిన విదిశ గుర్తుందా. ఆమె తను నటించిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అయ్యి ఆమెకు పేరు తేకపోవటంతో ఇండస్ట్రీకు దూరమైంది. 2012లో ఇండస్ట్రీ విడిచిపెట్టిన ఆమె మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. అదీ ఎన్టీఆర్ ..జనతా గ్యారేజ్ చిత్రంతో.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో ఆమె మళయాళి నటుడు ఉన్ని ముకుందన్ సరసన నటించనుంది. ఆమె తను హీరోయిన్ గా చేయకపోయినా...ఎన్టీఆర్,మోహన్ లాల్ వంటి స్టార్స్ నటిస్తున్న చిత్రంలో కనిపించటం ఆనందం కలిగిస్తోందని చెప్తోంది. ప్రస్తుతం ఆమె జనతా గ్యారేజ్ హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొంటోంది.

ఇక మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

Vidisha in NTR's Janatha Garage

దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్‌లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను ఓ రేంజిలో చూపిస్తారని అంచనా వేస్తున్నారు అభిమానులు.

తాజాగా జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో రీలీజ్ అయింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. ఇటీవల ముంబైలో ఎన్టీఆర్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

English summary
Vidisha has bagged NTR's Janatha Garage, in which she has been paired opposite young Malayali actor Unni Mukundan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu