»   » కబాలి2లో రజనీతో అగ్రతార.. నిర్మాత కూడా కన్ఫర్మ్.. న్యూస్ లీక్

కబాలి2లో రజనీతో అగ్రతార.. నిర్మాత కూడా కన్ఫర్మ్.. న్యూస్ లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రంలో విద్యాబాలన్ నటించనున్నారనే వార్త దాదాపు ఖరారైంది. ప్రస్తుతం రోబో 2.0 చిత్రంతో బిజీగా ఉన్న రజనీ తన తదుపరి చిత్రాన్ని రూపొందించే అవకాశాన్ని కబాలీ దర్శకుడు పా రంజిత్ ఇచ్చారు. కబాలీ సృష్టించిన హంగామా తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న మరో చిత్రంపై మళ్లీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్.. డేట్స్ అడ్జస్ట్..

విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్.. డేట్స్ అడ్జస్ట్..

ఇటీవల చిత్ర నిర్మాతలు విద్యాబాలన్‌ను కలిసి కథను వినిపించారట. దాంతో రజనీ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే డేట్లు సర్దుబాటు చేసే పనిలో విద్యాబాలన్ ఉన్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే ఆమె అగ్రిమెంట్‌పై సంతకం చేస్తారని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నటు పేర్కొన్నారు.

మామ సినిమాకు అల్లుడు ధనుష్ నిర్మాత

మామ సినిమాకు అల్లుడు ధనుష్ నిర్మాత

రజనీ నటించే ఈ చిత్రానికి ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మేలో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి చిత్రానికి ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ చిత్రం దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది.

కబాలికి సీక్వెల్ కాదు.. డిఫరెంట్

కబాలికి సీక్వెల్ కాదు.. డిఫరెంట్

పా రంజిత్ దర్శకత్వం వహించే చిత్రం కబాలికి సీక్వెల్ కాదట. సరికొత్త, విభిన్నమై కథాంశంతో రజనీ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర అత్యంత కీలకం కావడంతో విద్యాబాలన్ తీసుకొన్నట్టు సమాచారం.

దీపావళికి రోబో 2.0 రెడీ

దీపావళికి రోబో 2.0 రెడీ

శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రోబో 2.0 చిత్ర షూటింగ్‌లో రజనీకాంత్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానున్నది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే పా రంజిత్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు.

English summary
Rajinikanth next movie makers met Vidya Balan recently, and have finalised her as the lead. However, they are still working on the dates, and only then the official agreement would be signed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu