Just In
- 31 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Finance
యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
- Sports
టెస్ట్‌ల్లో ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వాషింగ్టన్ సుందర్
- News
షర్మిల నిజంగానే జగన్‌ను ధిక్కరించబోతున్నారా... ఆ ప్రచారంలో అసలు లాజిక్ ఉందా...?
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ టాపిక్: విజయ్ దేవరకొండకు ఊహించని కష్టం.. సమంత వల్ల ఖాళీ ఉండడం లేదట.!
విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో డీసెంట్‌గా కనిపించి మెప్పించాడు. ఇక, దీని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో అతడిలోని మరో యాంగిల్ చూపించి ఫిదా చేసేశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతోనే విజయ్ వరుస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడికి ఊహించని కష్టం వచ్చి పడింది. అది కూడా అక్కినేని వారి కోడలు సమంత రూపంలో. ఇంతకీ ఏంటా మేటర్.? వివరాల్లోకి వెళితే...

విజయ్‌కు భారీ షాక్ తగిలింది దీనితోనే
‘అర్జున్ రెడ్డి' తర్వాత ‘గీత గోవిందం' రూపంలో భారీ విజయాన్ని అందుకున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. దీని తర్వాత వచ్చిన ‘టాక్సీవాలా' కూడా పర్వాలేదనిపించింది. అయితే, గత ఏడాది విడుదలైన ‘డియర్ కామ్రేడ్' మాత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశను మిగల్చడంతో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.

ప్రేమికుల రోజున నలుగురు అమ్మాయిలతో..
విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో అతడి సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేఎస్ రామారావు సమర్పిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

టీజర్‌తో సినిమాపై ఊహాగానాలు మొదలు
కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ వల్ల ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో నలుగురు హీరోయిన్లతో విజయ్ నాలుగు గెటప్‌లలో కనిపిస్తున్నాడు. అలాగే, టీజర్‌లో కూడా నాలుగు వేరియేషన్ల బాడీ లాంగ్వేజ్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఈ మూవీలో అతడు చేసేది నాలుగు పాత్రలా.. నాలుగు వేరియేషన్లా.? అనేది ఆసక్తికరంగా మారింది.

విజయ్ సినిమా స్టోరీ లీక్.. అదే మెయిన్
ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్' స్టోరీ లీక్ అయిందంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో విజయ్ సినీ రచయితగా నటిస్తున్నాడట. తన వృత్తిలో భాగంగా ఓ మూవీ కోసం కథ రాస్తాడట. అందులో భాగంగానే ఒకే కథను నాలుగు వేరియేషన్లలో రాస్తాడని, వాటిలో తననే హీరోగా ఊహించుకుంటాడని అంటున్నారు. దీనికి స్క్రీన్‌ప్లేనే మెయిన్ అని టాక్.

విజయ్ దేవరకొండకు ఊహించని కష్టం
తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇలాంటి హీరోకు థియేటర్లు దొరకడం లేదట. అవును.. తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్న సమాచారాన్ని బట్టి... ‘వరల్డ్ ఫేమస్ లవర్'కు థియేటర్ల సమస్య వచ్చి పడిందని అంటున్నారు. సినిమా విడుదలకు సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని సమాచారం.

సమంత వల్ల ఖాళీ ఉండడం లేదట.!
సమంత - శర్వానంద్ జంటగా నటించిన చిత్రం ‘జాను'. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు ఇది రీమేక్‌గా వస్తోంది. మాతృకను తెరకెక్కించిన డైరెక్టరే దీన్ని కూడా రూపొందించాడు. అలాగే, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి ఏడున విడుదల అవుతోంది. దీంతో ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు ఆక్యూపై అయ్యాయని, దీనివల్ల విజయ్‌కు కష్టాలు వచ్చాయని తెలుస్తోంది.