రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!

Recommended Video

Vijay Devarakonda To Romance With Jhanvi Kapoor

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సక్సెస్‌ల తర్వాత సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టామినా పెరిగింది. కెరీర్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోయింది. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. త్వరలో మైత్రీ మూవీస్ రూపొందించే ఓ సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేమిటంటే..

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

మైత్రీ మూవీస్ బ్యానర్లో విజయ్ దేవరకొండ

మైత్రీ మూవీస్ బ్యానర్లో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీస్ రూపొందించే చిత్రంలో హీరోయిన్‌ది కీలకపాత్రనట. గ్లామర్, రొమాంటిక్ పాళ్లు ఎక్కువేనట. ఆ పాత్ర కోసం దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ అయితే బాగుంటుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారట. తన ఆలోచనను నిర్మాతలతో పంచుకోగా.. ఆమె ఒప్పుకుంటుందా? అనే విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.

జాహ్నవి కపూర్ కోసం ట్రయల్స్

జాహ్నవి కపూర్ కోసం ట్రయల్స్

అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన పేరు చెబితే జాహ్నవి తప్పకుండా ఒప్పుకుంటుంది. తనతో నటించడానికి ఒకే చెబుతుంది అనే ధీమాతో ఉన్నారట. అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి..ఆమెను ఒప్పించాలని సూచించారట. ఇంతకీ జాహ్నవి ఒప్పుకుంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.

ధడక్ సక్సెస్‌ జోష్‌తో

ధడక్ సక్సెస్‌ జోష్‌తో

ధడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి జాహ్నవి సక్సెస్ జోష్‌లో ఉంది. కరణ్ జోహర్ రూపొందించే చారిత్రాత్మక చిత్రం తఖ్త్‌లో నటించేందుకు ఒప్పుకొన్నది. ఆ తర్వాత ఏ సినిమాను ఒప్పుకొన్న దాఖలాలు కనిపించడం లేదు.

అక్టోబర్ 5న నోటా రిలీజ్

అక్టోబర్ 5న నోటా రిలీజ్

గీత గోవిందం తర్వాత తమిళ, తెలుగులో రూపొందుతున్న నోటా చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్దమవుతున్నది. ఆనంద శంకర్ రూపొందించే చిత్రంలో మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో కూడా విజయ్ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X