హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా.. సేతుపతి గ్రీన్ సిగ్నల్.. ఎవరితో అంటే?
నటుడు కావడానికి అష్టకష్టాలు పడి చివరికి హీరో స్థాయికి ఎదిగాడు విజయ్ సేతుపతి. అలా జాతీయ అవార్డ్ కూడా పొంది జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించాడు. కంపెనీ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన నటనతో ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటిస్తూ విలన్ గా అవకాశాలు వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ ఏడాది ఆయన విలన్ గా నటించిన ఉప్పెన సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆయన హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

పిజ్జాతో ఎంట్రీ
నిజానికి పిజ్జా అనే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తర్వాత తమిళంలో చాలా సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఉప్పెన సినిమా కంటే ముందు ఆయన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. కానీ ఆ సినిమా మా లో ఆయనది చిన్న పాత్ర కావడంతో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇక ఉప్పెన సినిమా విషయానికి వస్తే ఆయన నటన జనానికి బాగా నచ్చింది.

ఉప్పెన ఎఫెక్ట్
ఇక ఆ సినిమా డబ్బింగ్ విషయంలో మాత్రం సరిగ్గా నప్పలేదు. ఆ మధ్య ఈ అంశాన్ని విజయ్ సేతుపతి దృష్టికి తీసుకువెళ్లగా ఇకమీదట ఆ ఇబ్బందులు లేకుండా తానే తెలుగు నేర్చుకుంటున్నాను అని కూడా చెప్పుకొచ్చాడు. తాను తెలుగు భాష నేర్చుకోవడం ప్రారంభించానని, ఒక్కసారి తెలుగు భాష మీద పట్టు సాధించానని తనకు అనిపిస్తే తెలుగులో మరిన్ని సినిమాలు అంగీకరించాలని అనుకుంటున్నానని సేతుపతి చెప్పుకొచ్చాడు.

డైరెక్ట్ తెలుగు సినిమా
అయితే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ తెలుగు మూవీ చేసే అవకాశం అందుకున్నారని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట, ఆయనకి కధ నచ్చడంతో మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా కోసం సేతుపతికి పారితోషకం తోపాటుగా సినిమాలో వాటా కూడా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
Recommended Video

పుష్పలో మిస్
నిజానికి అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా ఆయన విలన్ పాత్రలో నటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా కాల్షీట్స్ ఇబ్బందుల కారణంగా ఆయన విలన్ పాత్రలో నటించే లేకపోతున్నాడు. విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి రెండు వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గా ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది.


Click it and Unblock the Notifications











