»   » మహేష్ ...విజయవాడ కుర్రాడు

మహేష్ ...విజయవాడ కుర్రాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లక్ష్మీ నరసింహ, రవితేజ కృష్ణ వంటి చిత్రాలు విజయవాడ బ్యాక్ డ్రాప్ లో వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఎవరూ విజయవాడలో జరిగే కథగా కథలు రాయటం లేదు. అంతా హైదరాబాద్ లోనే జరిగేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మొదటినుంచి భిన్నమైన బ్యాక్ డ్రాప్ లు తీసుకుంటూ వస్తున్న శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం బ్రహ్మోత్సవం కు విజయవాడ ను బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్లు సిని వర్గాల సమాచారం. నిర్మాత పివిపి కు కూడా అది హోమ్ టౌన్ కావటం విశేషం.

అలాగే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో విజయవాడ లో జరిగే కథలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు దర్శక,నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతోంది. మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Vijayawada backdrop for Mahesh Babu’s flick

మరిన్ని వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది.

గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

English summary
Mahesh Babu is gearing up with the same backdrop for his next. As his next “Brahmotsavam” is being produced by PVP and directed by Srikanth Addala, the film has its pre-production work going on at rapid pace.
Please Wait while comments are loading...