»   » పాపం..విశాల్ సినిమాను కొనేవారే కరువయ్యారు

పాపం..విశాల్ సినిమాను కొనేవారే కరువయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాల్, నీతూచంద్ర కాంబినేషన్లో జి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మించిన కిలాడి చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కొనేవారు కరువయ్యారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పందెం కోడి తర్వాత వచ్చిన విశాల్ సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవటంతో ఆ ఎఫెక్టు ఈ చిత్రంపై పడిందంటున్నారు. మొన్నటివరకూ బి,సి సెంటర్లు అయినా ఆడతాయని నమ్మి కొన్న భయ్యర్లు అసలు ఈ సారి ఎంక్వైరీ చేయటానికి కూడా ఆసక్తి చూపటం లేదంటున్నారు. ఇక ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రం కథ గురించి కిలాడి దర్శకుడు తిరు మాట్లాడుతూ మా చిత్రంలో సిద్దార్ద ముగ్గురు అమ్మాయిలను పరిశీలించి వారిలో ఒకరిని చేసుకుంటారు. వారిలో ఒకరు చిననాటి గర్ల్ ప్రెండ్ అయితే మరొకరు క్రీడాకారిణి, మరొకరు కాలేజీ స్టూడెంట్, వేరొకరు సోషల్ యాక్టివిస్ట్. వీరి ముగ్గురుని వేరు వేరుగా పరచయం చేసుకుని వారితో రొమాన్స్ నడిపి వారి గురించి తెలుసుకుని ఒకరిని ఎంపిక చేసుకోవటమే కథ అని చెప్పాడు. ఇక ఈ చిత్రం తమిళ రైట్స్ ని సన్ టీవీ వారు కొనుగోలు చేసారు. అయితే తెలుగుకి అలాంటి ఆఫర్ ఏది లేకపోవటంతో సొంతంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu