»   » హనుమంతుడుగా మంచు విష్ణు

హనుమంతుడుగా మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హనుమంతుడుగా మంచు విష్ణు త్వరలో కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. తెలుగు,ఇగ్లీష్, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. హనుమంతుడు పుట్టుక నుంచి హిమాలయాలకు ఆయన వెళ్లటం వరకూ చూపనున్నట్లు చెప్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందనుందని చెప్పారు. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సాయింతో ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తారు. అలాగే దర్శకుడు సైతం హాలీవుడ్ నుంచి తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇండియన్ మైధాలిజీకు ఇంటర్నేషనల్ ట్రీట్ మెంట్ ఇస్తారని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక మంచు విష్ణు తాజా చిత్రం 'డైనమైట్‌' విషయానికి వస్తే..


దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న 'డైనమైట్‌' చిత్రం ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌. సినిమా నిండా ఫైటింగులూ, ఛేజింగులే. అందుకే యాక్షన్‌ ఎపిసోడ్స్‌పై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు విష్ణు. కేవలం ఫైట్స్‌ కోసం 47 రోజులు కేటాయించారంటే ఈ సినిమాలో యాక్షన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. కొన్ని పోరాట దృశ్యాల్లో విష్ణుతో పాటు హీరోయిన్ ప్రణీత పాలుపంచుకొంది. విజయన్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ పోరాట దృశ్యాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని మంచు విష్ణు చెబుతున్నారు. వచ్చే నెల 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Vishnu Manchu To Play Lord Hanuman

'డైనమైట్‌'లోని పోరాట ఘట్టాల గురించి 'ఈనాడు సినిమా'తో విష్ణు మాట్లాడుతూ ''సూర్యం'లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఆ తరవాత నాలోని యాక్షన్‌ను అంతగా వాడుకోలేదనే చెప్పాలి. 'రౌడీ'లో విశ్రాంతి ముందొచ్చే ఫైట్‌ మళ్లీ నాలోని యాక్షన్‌ కోణం చూపించింది. ఆ తరవాత పూర్తిస్థాయి పోరాటాలు చూపించే అవకాశం 'డైనమైట్‌'లో దొరికింది. సినిమా అంతా పరుగులు పెడుతూనే ఉంటుంది. స్క్రీన్‌ప్లే అలాంటిది.


దాదాపు పదేళ్ల తరవాత ఈ స్థాయిలో యాక్షన్‌ సీన్స్‌ చేసే అవకాశం దక్కింది. అందుకే ఈ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టా. నా శరీరాన్ని యాక్షన్‌ సీన్స్‌కి సిద్ధం చేయడానికి ముందుగా బ్యాంకాక్‌ వెళ్లా. అక్కడ కెచ అనే ఫైట్‌ మాస్టర్‌ ఉన్నారు.


'సలీమ్‌' కోసం తెలుగు చిత్రసీమకు నేనే ఆయన్ని పరిచయం చేశా. ఆ సినిమాతో చాలా పాపులర్‌ అయ్యారు. తన దగ్గర కొన్ని రోజులు శిక్షణ తీసుకొన్నా. షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో ఇద్దరు జిమ్‌ కోచ్‌లుండేవారు. ఒకరు లాస్‌ ఏంజిలెస్‌ నుంచి వచ్చిన రాజర్‌ ఫెడ్రిక్‌. రెండో కోచ్‌ హైదరాబాద్‌కు చెందిన సంపత్‌రెడ్డి. ఈ సినిమా కోసం దాదాపు ఏడు కిలోల బరువు పెరిగా. ఎందుకంటే షర్టు వేసుకొన్నా బాడీ కనిపించాలి.


'వీడు కొట్టేలానే ఉన్నాడ్రా..' అనిపించాలి. విజయన్‌ మాస్టర్‌ ఫైట్లని బాగా తీర్చిదిద్దారు. తెరపై పోరాట దృశ్యం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. నాకు స్వతహాగా హాలీవుడ్‌ చిత్రాలంటే ఇష్టం. అక్కడ ఫైట్స్‌ కోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఆ స్థాయిలో కాకపోయినా, అలాంటి ఫైట్స్‌ మనమూ ప్రయత్నించొచ్చని చెప్పడానికి 'డైనమైట్‌'ని ఓ వేదికగా తీసుకొన్నా. ఫైట్‌ సీనంటే దెబ్బలు తగలడం మామూలే. ఈ సినిమాలోనూ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. రిస్కీ ఫైట్స్‌ ఎందుకు అని అడుగుతుంటారు. రిస్క్‌ లేకపోతే ఆటలో మజా ఎక్కడిది'' అన్నారు.

English summary
Vishnu Machu is likely to play Lord Hanuman in an upcoming mythological film based on Hanuman. The film will be made in three languages simultaneously - English, Telugu and Tamil. Vishnu is contemplating to rope in a Hollywood director and Hollywood production house to collaborate with him for the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu