»   »  విష్ణు తెగింపు...‘దేనికైనా రెడీ’ అంటూ!

విష్ణు తెగింపు...‘దేనికైనా రెడీ’ అంటూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో మంచు విష్ణు త్వరలో 'దొరకడు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వినిపస్తున్న సంగతి తెలిసిందే. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.

అయితే ఈ చిత్రానికి 'దొకరడు' అనే టైటిల్ కాకుండా 'దేనికైనా రెడీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో విష్ణు పాత్ర దేనికైనా తెగించే ధోరణిలో ఉంటుందని, అందుకే ఆ టైటిల్ పరిశీలిస్తున్నట్ల సమాచారం. గతంలో విష్ణు నటించిన 'ఢీ' తరహాలోనే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ చక్రిని తీసుకున్నారు. అయితే అతని బద్దకం వల్ల ప్రాజెక్టు లేటవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విష్ణుకు చెందిన క్లోజ్ పర్శన్ మాట్లాడుతూ... చక్రి ట్యాలెంట్ ఉన్న మ్యాజిక్ డైరక్టర్.. కాదనేం. కానీ చాలా బద్దకస్తుడు. సెప్టెంబర్ 2011లో మా చిత్రానికి మ్యూజిక్ ఇవ్వటం మొదలెట్టాడు. ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు. ఇప్పటికే కేవలం రెండు పాటలు మాత్రమే ఇచ్చాడు. మిగతా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి. మేం ఆయన వల్ల డబ్బు, టైమ్ కోల్పోయాం.

మేం వేరే కంపోజర్ ని వెతుక్కునే ఆలోచనలో ఉన్నాం అన్నారు. ఇక ఈ విషయాన్ని మీడియా వారు చక్రి వద్ద ఉంచగా.. ఆయన ఇవి రూమర్స్ అని కొట్టిపారేసారు. నేను ఇప్పటికీ మ్యూజిక్ డైరక్టర్ తో సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాను. ఇది ఓ క్రియేటివ్ జాబ్. నాకు తృప్తి చెందనిదే నేను ట్యూన్ ఇవ్వలేను. దాంతో కొంత టైమ్ పట్టడం సహజం. నేనెప్పుడూ ఎవరి షూటింగ్ లు లేట్ లకు కారణం కాలేదు అన్నారు.

English summary

 Manchu Vishnu Babu is currently busy with the shooting of a new movie that has Hansika in the lead role along with thim. G.Nageshwar Reddy is the director. The latest buzz in the industry is that the movie will be titled ‘Denikaina Ready’.
Please Wait while comments are loading...