»   » పవన్ కళ్యాణ్, విష్ణు సినిమాలో హీరోయిన్‌ చాన్స్ ఆమెకే దక్కే అవకాశం

పవన్ కళ్యాణ్, విష్ణు సినిమాలో హీరోయిన్‌ చాన్స్ ఆమెకే దక్కే అవకాశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొమరం పులి సినిమాతో తెలుగు తెరకు నికిషా పటేల్‌ని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు కొత్త హీరోయిన్లుని దూరం పెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుతో నటించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న లవ్లీ సినిమాలో త్రిషని, త్వరలో ప్రారంభం కానున్న గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్‌ని ఎంచుకున్నాడు.

ఐతే మార్చిలో విష్ణువర్దన్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న సినిమాలో మరలా కొత్త హీరోయిన్‌నే తీసుకోనున్నట్లు సమాచారం. ఈసినిమాలో ప్లాష్ బ్యాక్‌లో వచ్చేటటువంటి సీన్లులో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ హీరోయిన్లునే తీసుకోనున్నట్లు సమాచారం. ఆఅవకాశం అనుష్కకు దక్కే అవకాశం ఉందని ఫిలింవర్గాల సమాచారం. మొన్నటివరకు పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే రెండు సంవత్సరాల వరకు పూర్తి కాదనే నమ్మకం ఉన్నటువంటి హీరోయిన్లు ఇప్పుడు వారి పంధా మార్చుకున్నట్లు ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎడాపెడా సినిమాలు ఒప్పుకోవడమే దానికి కారణం అంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu