twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కడలి’ని కూడా నిషేదిస్తారా... మణిరత్నం భయం అదే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రంపై ముస్లిం సంస్థలు ఆందోళన వ్యక్తం చేయడం, ఈ సినిమా తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై బ్యాన్ విధించింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కూడా సినిమా ప్రదర్శన ఆపి వేసారు. ఈ నేపథ్యంలో మణిరత్నం 'కడలి' చిత్రానికి కూడా ఇదే భయం పట్టుకుందంటూ సోషనల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రచారం సాగుతోంది.

    కడలి చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. తమిళనాడు తీరంలో ఓ జాలర్ల గ్రామంలోని ఓ జంట మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మొత్తం క్రైస్తవ జాలరి జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విశ్వరూపం చిత్రంపై బ్యాన్ నేపథ్యంలో 'కడలి' చిత్రంపై కొందరు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సెటైర్లు ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాను నిషేదించాలంటూ సినిమాలో చూపించిన జాలర్ల వర్గానికి చెందిన వారు ఆందోళనకు దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

    "జాలరి కమ్యూనిటీ యొక్క సమూహం వారు వెండి తెరపై తమ పేద జీవితాలను చూపించడం ద్వారా తమను అవమానించారని, మనోభావాలు దెబ్బతీసారని ఫిర్యాదు చేస్తే, బహుశా ప్రభుత్వం కూడా ఈ చిత్రంసై కూడా నిషేధిస్తుందేమో." అని కామెంట్లు చేస్తున్నారు.

    కడలి చిత్రం ద్వారా తమిళనటుడు కార్తీక్ తనయుడు గౌతమ్, మాజీ హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి కడలి చిత్రం ద్వారా హీరో హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న, యాక్షన్ స్టార్ అర్జున్. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

    English summary
    The screening of Kamal Hassan's much-hyped movie Vishwaroopam was banned in Tamil Nadu and in some parts of Andhra Pradesh and Karnataka after Muslim community protested against it. Following this incident, a few jokes about the movie Kadali are being circulated in the social networking sites. Its director Mani Ratnam is afraid of the movie's ban in the state following the jokes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X