»   » సర్దార్ వల్ల నష్టమే? పవన్ కోసం భరిస్తానంటున్న వైజాగ్ బయ్యర్!

సర్దార్ వల్ల నష్టమే? పవన్ కోసం భరిస్తానంటున్న వైజాగ్ బయ్యర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఈ నెల 8న గ్రాండ్‌గా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హైప్ హై రేంజిలో ఉంది. అన్ని ఏరియాల్లో ఈ చిత్రాన్ని బయ్యర్లు భారీ రేటుకు కొనుగోలు చేసారు. కొన్ని ఏరియాల్లో బాహుబలి సినిమా కంటే ఎక్కువ ధర పలకడం గమనార్హం. బాహుబలి సినిమాకు ఉన్న రేంజిలో ప్రీ-రిలీజ్ హైప్ లేకున్నా బయ్యర్లు ఇంత రేటు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.

పవన్ కళ్యాణ్ హీరో కావడం, సమ్మర్ హాలిడేస్ కావడంతో కొందరు లాభాలు వస్తాయనే నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టారు. మరికొందరేమో లాభాలొస్తాయా? లేదా? అనే విషయం కంటే.... పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసామనే పేరు కోసమే ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నారు.


 Vizag buyer may lose a crore for Pawan Kalyan

కేవలం పవన్ కళ్యాణ్ కోసమే సినిమా రైట్స్ దక్కించుకున్న వారిలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ క్రాంతి రెడ్డి ఒకరు. ఈయన సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాదు... మెగా ఫ్యామిలీకి నమ్మకమైన వ్యక్తి. చిరంజీవి రోజుల నుండే ఆయన మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ వస్తున్నారు.


'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కోసం పోటీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ క్రాంతి రెడ్డికే రైట్స్ అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఆఫర్ చేసారనే కారణంగానే.... కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసారు క్రాంతి రెడ్డి. ఇదే విషయమై ఆయన్ను కొందరు ప్రశ్నిస్తే...'ఈ సినిమా వల్ల నేను లాభ పడొచ్చు...లేదా కోటి లేదా రెండు కోట్లు లాస్ కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కోసం లాభమైనా, నష్టమైనా భరించడానికి నేను సిద్దమే' అని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.

English summary
SGS was picked up for 7.4 Crores for Uttarandhra, which is unheard of. “I may lose a crore or two. But I will be in the good books of Pawan Kalyan and that is all that matters for me”, buyer Kranthi Reddy reportedly told his friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu