'మనసంతా నువ్వే' దర్శకుడు తో అల్లరి నరేష్ చిత్రం
మనసంతా నువ్వే దర్శకుడు వియన్ ఆదిత్య త్వరలో అల్లరి నరేష్ ని డైరక్ట్ చేయనున్నారు. అహనా పెళ్ళంట చిత్రం సీక్వెల్ గా ఈ చిత్రం రానున్నదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డా.డి.రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇక వియన్ ఆదిత్య ప్రస్తుతం రాజ్ అనే చిత్రం రూపొందించి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సుమంత్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ప్రియమణి, విమలారామన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక ఇప్పటికే అహనా పెళ్ళంట టైటిల్ తో అల్లరి నరేష్ ఓ చిత్రం రూపొందించి త్వరలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వీరభధ్రమ్ డైరక్షన్ చేసారు.
అల్లరి నరేష్ వియన్ ఆదిత్య రాజ్ ప్రియమణి అహనా పెళ్ళంట allari naresh vn aditya raj priyamani ahana pellanta


Click it and Unblock the Notifications