twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయక్ మళ్లీ షాకిచ్చాడు.. ఫ్లాప్ నుంచి తెరుకోకుండానే.. అఖిల్ దారిలోనే..

    By Rajababu
    |

    Recommended Video

    వినాయక్ మళ్లీ షాకిచ్చాడు.. అఖిల్ దారిలోనే..!

    టాలీవుడ్‌లో భారీ చిత్రాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీగానే బోల్తా కొడుతున్నాయి. 2018 సంవత్సరం మెగా హీరోలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఆ తర్వాత వచ్చిన సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ చిత్రం ఊహించని ఫ్లాప్‌‌ను చవిచూసింది. ఇంటిలిజెంట్ సినిమా దర్శకుడు వినాయక్ ప్రవర్తించిన తీరు ఇప్పడు మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

     నష్టాల్ని తగ్గించే ప్రయత్నంలో..

    నష్టాల్ని తగ్గించే ప్రయత్నంలో..

    అజ్ఞాతవాసి, ఇంటిలిజెంట్ చిత్రాలు డిస్టిబ్యూటర్లకు దారుణమైన నష్టాల్ని తెచ్చిపెట్టాయి. అజ్ఞాతవాసి చిత్రం వల్ల నిర్మాత, డిస్టిబ్యూటర్లు చవిచూసిన నష్టాల్నికొంత తగ్గించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని వెనుకకు తిరిగి ఇచ్చినట్టు సమాచారం.

     ఇంటిలిజెంట్‌కు 20 కోట్ల నష్టం

    ఇంటిలిజెంట్‌కు 20 కోట్ల నష్టం

    తాజాగా ఇంటిలిజెంట్ విషయంలోనూ అదే జరిగింది. ఇంటిలిజెంట్ సినిమాను నిర్మాత సీ కల్యాణ్ సుమారు 27 కోట్లతో రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దారుణమైన టాక్ సొంతం చేసుకోవడంతో సుమారు 20 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట.

    రూ. 5 కోట్లు వాపస్

    రూ. 5 కోట్లు వాపస్

    తాను దర్శకత్వం వహించిన చిత్రం భారీ నష్టాల్ని మిగల్చడంతో నిర్మాత, డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి వినాయక్ ముందుకొచ్చాడట. తాను తీసుకొన్న 9 కోట్ల రెమ్యునరేషన్ నుంచి సుమారు రూ.5 కోట్లను తిరిగి ఇచ్చేశాడట. వినాయక్ అనుసరించిన తీరుపై సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

     అఖిల్ ఫ్లాప్‌ అయినప్పడు కూడా..

    అఖిల్ ఫ్లాప్‌ అయినప్పడు కూడా..

    వినాయక్ ఇలా వ్యవహరించడం మొదటిసారి కాదు. అఖిల్ సినిమా దారుణంగా బోల్తా కొట్టినప్పడు కూడా తన రెమ్యునరేషన్‌లో నుంచి కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం సంచలనం రేపింది. అఖిల్ సినిమా బయ్యర్లను, నిర్మాతను ఆదుకోవడానికి రూ.5 కోట్లు వెనుకకు తిరిగి ఇచ్చాడనేది అప్పట్లో సంచలనం రేపింది.

    వీవీ వినాయక్‌పై ప్రశంసలు

    వీవీ వినాయక్‌పై ప్రశంసలు

    సినిమా హిట్ అయితే అంతా తామే అని కామెంట్లు చేస్తారు కొందరు. ఫ్లాప్ అయితే మాత్రం ముఖం చాటేస్తారు మరికొందరు. కానీ సినిమా ఫ్లాప్ అయినా బాధ్యతగా తన వంతుగా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చిన దర్శకుడు వినాయక్‌పై సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

     ఇంటెలిజెంట్‌కు భారీ నష్టమే

    ఇంటెలిజెంట్‌కు భారీ నష్టమే

    ఇంటిలింజెట్ తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 7 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం సుమారు 27 కోట్లకు అమ్మినట్టు తెలుస్తున్నది. దాదాపు ఈ చిత్రానికి 20 కోట్లకుపైగే నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం.

    English summary
    Sai Dharam Tej's Intelligent movie become disaster at box office. Hero Naga Chaitanya Akkineni was first chioce this movie. But Chaitu was rejected because of story, treatment. But Sai Dharam Tej was shown interest do film for VV Vinayak. But Vinayak have not saved Sai Dharam Tej from flops. But he saved the buyers by giving 5 crores back.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X