»   » ఇక్కడ నీళ్లు..ఇక్కడే: సుకుమార్ దారిలోనే వినాయిక్ కూడా..

ఇక్కడ నీళ్లు..ఇక్కడే: సుకుమార్ దారిలోనే వినాయిక్ కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ ప్రక్క స్టార్ నిర్మాతలు అనుకున్నవాళ్లేమో దివాళా తీసి, ఆఫీసులు జప్తు చేయించుకునే స్దితికి వస్తున్నారు. మరో ప్రక్కన స్టార్ దర్శకులు, హీరోలు నిర్మాతలుగా మారుతూ తమ పెట్టుబడులను అక్కడ సైతం పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ సంపాదించుకున్న మొత్తాలను ఇక్కడే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. పెడుతున్నారు. ఇది మంచి పరిణామమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగుతున్న మహేష్ బాబు అఫీషియల్ గా తన బ్యానర్ ఓపెన్ చేసి తన సినిమాలకు సహ నిర్మాతగా ఉంటున్నారు. మొన్న సూపర్ హిట్టైన శ్రీమంతుడు చిత్రానికి ఆయన సహ నిర్మాతే. రాబోయే తన చిత్రాలకు కూడా ఆయన తన టై అప్ లో సహ నిర్మాతగానే చేయాలనుకుంటున్నారు.

VV Vinayak is all set to turn producer

ఇంతేనా ఇంటిలిజెంట్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ సైతం నిర్మాతగా మారి చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తూ తన అశోశియేట్స్ ని ఉత్సాహపరుస్తున్నారు. కుమారి 21ఎఫ్ అలా వచ్చి హిట్టైందే. ఇప్పుడు మరో స్టార్ డైరక్టర్ వివి వినాయిక్ సైతం అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి 150 సినిమాపై పనిచేస్తున్న వినాయిక్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తను డైరక్ట్ చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తారా లేక తన వద్ద పనిచేసిన వారి టాలెంట్ గుర్తించి వారితో సినిమాలు తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

English summary
VV Vinayak is also turning producer. Vinayak is determined to produce films on his own.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu