»   » భయపడే..అనుష్క అలా మాట్లాడిందా?

భయపడే..అనుష్క అలా మాట్లాడిందా?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ :'' హీరోలు ఎంత కష్టపడతారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఓ సినిమాని నెత్తిమీద పెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. విజయాల్లో వారికి ఎక్కువ వాటా ఇవ్వాల్సిందే. అది వారి హక్కు'' అని హీరోల్ని వెనకేసుకొస్తోంది అనుష్క. అయితే ఆ మాటలు అనటానికి కారణం ఏమిటి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

  ఆమె వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూండటంతో హీరోలు ఆమెను తమ ప్రక్కన బుక్ చేయటానికి ఆసక్తి చూపటం లేదని, ఒకప్పటి విజయశాంతిలా తనకు ఇక ఇలాంటి పాత్రలే కంటిన్యూగా చెయ్యాల్సిన పరిస్ధితి వస్తుందని భావించే అనుష్క ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తోందంటున్నారు.

  ప్రస్తుతం అనుష్క ప్రస్తుతం చారిత్రక నేపథ్యం ఉన్న 'రుద్రమదేవి'లో నటిస్తోంది. ఈ కథలో తన పాత్రే కీలకం. దీనికి తన కెరీర్‌లో ఎప్పుడూ ఇవ్వనన్ని కాల్షీట్లను కేటాయించింది. దాదాపు ఏడాది పాటు మరో సినిమా ముట్టుకోలేదు. మామూలుగా అయితే ఇదే సమయంలో మూడు సినిమాల్ని అవలీలగా పూర్తిచేయొచ్చు. అంటే దాదాపుగా మూడు సినిమాల పారితోషికం వదులుకొందన్నమాట. దానికితోడు కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

  దాంతో 'ఇక మీదట డాన్సులే చేస్తా' అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. "వర్ణ, బాహుబలి, రుద్రమదేవి సినిమాల కోసం కత్తిపట్టింది చాలు. ఇక హీరోలను పట్టుకోవాలనుకుంటున్నాను. హీరోలను పట్టుకుని వారితో స్టెప్పులేయాలని ఉంది'' అని మనసులో మాట చెప్పింది అనుష్క. అనుష్క కీలక పాత్రలో నటించిన సినిమా 'వర్ణ'. శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ఆర్య, అనుష్క కలిసి నటించారు. ఈ సినిమా ఆడియో వేడుక సందర్బంగా ఆమె ఇలా మాట్లాడింది. అది చర్చనీయాంసమైంది.

  మరోప్రక్క హీరోయిన్ ఓరియెంటెడ్ కథలపై అనుష్క కి ఆసక్తి తగ్గటానికి కారణం ఏమిటీ అంటే...రెగ్యులర్ గా చేసే గ్లామర్‌ పాత్రల వల్ల గుర్తింపు వస్తుందా.. రాదా? అనేది పక్కన పెడితే.. ఆ తరహా సినిమాల వల్ల రిస్క్‌ ఉండదు. సినిమా హిట్,ప్లాప్ ల వల్ల కెరీర్‌ కుంటుపడే ప్రమాదం ఉండదు. అదే హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాల సంగతి వేరే. ఎంత కష్టపడి చేసినా సినిమా సరిగా ఆడకపోతే పరిస్థితి ఏమిటి? ఆ తరవాత గ్లామర్‌ పాత్రలు దక్కుతాయా? అనే భయాలు వెంటాడుతున్నాయి. అందుకే ఆమె ఈ డెషిషన్ తీసుకుంది అంటున్నారు.

  English summary
  Anushka stated she is tired of holding swords and fighting and wants to hug heroes, do some romantic scenes and dance with them. For some, it sounded like a shady statement. But in fact, this is an intelligent statement. Those who thought that Anushka would continue doing solo heroine roles this is the answer that she is still set to do the commercial glamorous roles. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more