పాకిస్థాన్‌ క్రికెటర్‌ను రేఖ పెళ్లి చేసుకోవాలనుకొందా? అమితాబ్‌తో బ్రేకప్ తర్వాత ఏం జరిగిందంటే?

బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో కూడా మోస్ట్ పాపులారిటీ సంపాదించుకొన్న సీనియర్ హీరోయిన్లలో రేఖ ఒకరంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. దక్షిణాది నుంచి హిందీ సినిమా పరిశ్రమకు వెళ్లి అక్కడి స్టార్ హీరోయిన్లను తలదన్నేలా సూపర్ స్టార్ స్టేటస్‌ను అనతికాలంలో సంపాదించుకొన్నారు. అంతేకాకుండా అగ్ర హీరోలతో నటించి మెప్పించారు. అయితే ఆమె జీవితంలో ఎన్నో ప్రేమ వ్యవహారాలు, ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌తో లవ్ అఫైర్, బ్రేకప్ ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే అమితాబ్‌తో ప్రేమ వ్యవహారం వైఫల్యం తర్వాత పాకిస్థాన్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నదనే వార్తను బాలీవుడ్ పత్రిక ప్రచురించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ పాకిస్థాన్ క్రికెటర్ ఎవరనే వివరాల్లోకి వెళితే..

తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చిన రేఖ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఉత్తరాది ప్రేక్షకుల మనసును దోచుకొన్నది. అంతేకాకుండా హిందీ సినిమా అందించిన లెజెండరీ యాక్టర్లలో ఒకరిగా నిలిచింది. కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా.. వ్యక్తిగత జీవితం అనేక కుదుపులకు లోనైంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో విఫలం కావడం.. ఆమె పెళ్లి కూడా ఊహించని విధంగా షాకిచ్చింది. దాంతో ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

Rekha dating with Pakistan Cricketer Imran Khan

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో సన్నిహితంగా ఉన్నారు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకోవడం తథ్యం అని అందరూ భావించారు. కానీ వారి ప్రేమలోకి జయ బాదురి వచ్చి భారీ ట్విస్టు ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అమితాబ్, జయ పెళ్లి చేసుకోవడంతో రేఖ ప్రేమవ్యవహారం విషాదంగా ముగిసింది.

అయితే ఆ తర్వాత ముఖేష్ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్తను రేఖ పెళ్లి చేసుకోవడమే సంచలనం. అయితే ఎక్కువ రోజులు వారి దాంపత్య జీవితం కొనసాగలేకపోయింది. ముఖేష్ అనూహ్యంగా మరణించడంతో మళ్లీ ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకొన్నది. ఆతర్వాత ఆమెతో అనేక రకాలుగా అఫైర్ వార్తలు మీడియాలో వచ్చాయి. అవన్నీ గాసిప్స్, రూమర్లుగానే మిగిలిపోయింది. ఇప్పటికే ఆమె ఒంటిరిగానే జీవితాన్ని గడుపుతున్నారు.

Rekha dating with Pakistan Cricketer Imran Khan

అయితే అప్పట్లో రేఖ అఫైర్ గురించి స్టార్ అనే మ్యాగజైన్ ఓ వార్తను ప్రచురించడం సంచలనంగా మారింది. పాకిస్థాన్ క్రికెటర్, కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌తో ఆమె ముంబై బీచ్‌లో ఏకాంతంగా మీడియా కంటికి చిక్కడంతో వారిద్దరి రిలేషన్ బయటకు వచ్చింది. అయితే ఇమ్రాన్, రేఖ ఇద్దరు డేటింగ్ చేశారు. వారు ఓ దశలో పెళ్లి కూడా చేసుకొన్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో కనిపించింది. అయితే ఆ వార్త.. వార్తగానే మిగిలిపోయింది. ఆ వార్త రూమర్, గాసిప్‌గానే ట్రీట్ చేశారు. అయితే తాజాగా రేఖ అఫైర్ వార్త మరోసారి మీడియాలో బయటకు పొక్కి సెన్సేషన్‌గా మారింది.

More from Filmibeat

Read more about: rekha bollywood imran khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X