»   » చిరంజీవి ఆ కారణంతోనే ‘వరుడు’ కి దూరం అయ్యాడా!

చిరంజీవి ఆ కారణంతోనే ‘వరుడు’ కి దూరం అయ్యాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజకీయాలతో బిజీగా ఉండి సినిమా ఫంక్షన్లకి హాజరు కావడం బాగా తగ్గించినా తమ కుటుంబ సినిమాల వేడుకలకి మాత్రం చిరంజీవి గైర్హాజరీ చాలా రేర్ గా జరుగుతుంటుంది. అయితే 'వరుడు" ఆడియో రిలీజ్ కి చిరంజీవి రాకపోవడం చర్చనీయాంశమయింది. పవన్ కళ్యాణ్, చరణ్ లు కూడా ఈ ఫంక్షన్ లో దర్శనమివ్వకపోవడంతో పలువురి ఆసక్తిని ఈ అంశం ఆకర్షించింది. చరణ్ షూటింగ్ పనులతో విదేశాల్లో ఉండడం అతని ఆబ్సెన్స్ కి కారణమైతే, పవన్ ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్ కి దూరమే కనుక అతను రాకపోయి మరీ అంతగా ఎవరూ పట్టించుకోలేదు.

కానీ చిరంజీవి రాకపోడంపై పలు సందేహాలు వ్యక్తవుతున్నాయి. ముఖ్యంగా చిరు తెలంగాణ వాదంతో అల్లు అర్జున్ గత చిత్రం 'ఆర్య 2" తెలంగాణ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 'వరుడు" విషయంలో కూడా మెగా స్టార్ ఆడియో ఫంక్షన్ కి రావడం వలన నైజాంలో 'వరుడు" కి ఇబ్బందులు కలిగిస్తుందేమోననే అనుమానమే ఆయన గైర్హాజర్ కి కారణమని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి రాకపోయినా 'వరుడ" ఆడియో రిలీజ్ ఫంక్షన్ వద్ద తెలంగాణవాదులు తమదైన శైలిలో రెచ్చిపోయారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu