»   » అఖిల్ పెళ్లి కాన్సిల్ పై నాగ్ స్పందన ఏంటి, ఆ విషయంలోనే తేడా వచ్చే..?

అఖిల్ పెళ్లి కాన్సిల్ పై నాగ్ స్పందన ఏంటి, ఆ విషయంలోనే తేడా వచ్చే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిన్నటి నుంచి ఫిల్మ్ సర్కిల్స్ లో మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ వివాహం ఆగిపోయిందా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా డెస్టినేషన్ మ్యారేజ్ కు చెందిన ...రోమ్‌ ప్రయాణాన్ని కేన్సిల్‌ చేసుకోవాలంటూ గత శనివారం సన్నిహితులకు సమాచారం వెళ్లిందని దానితోనే ఈ వార్త బయిటకు వచ్చినట్లు చెప్తున్నారు. అయితే పెళ్లి రద్దుకు కారణం మాత్రం చెప్పలేదని తెలిసింది. పెళ్లి రద్దు నిర్ణయం శ్రియ కుటుంబం నుంచే వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

దాంతో అఖిల్‌ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్‌, శ్రియ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనీ, డెస్టినేషన వెడ్డింగ్‌ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయనీ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

What went wrong in Akhil-Shriya's paradise?

ఈ విషయమై నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్ని ప్రక్కన పెట్టిన ఆయన ...తమ రెండు కుటుంబాల పెద్దలు, అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని అటు వైపు వారికి నాగార్జున సూచించారని తెలుస్తోంది. అయితే ..., అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.

అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించటానికి ఇష్టపడటం లేదని సమాచారం. ముఖ్యంగా ఈ విషయమై రెండు కుటుంబాలలోని అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మీడియావారు ఈ విషయమై స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది సాద్యం కావటం లేదు. ఆంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలూ తెలియజేస్తున్నాయి.

ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌తో 2016 డిసెంబర్‌లో అఖిల్‌ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తేదీ ప్రకటించకపోయినా.. ఈ వేసవిలోనే రోమ్‌(ఇటలీ)లో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టిక్కెట్లను కూడా బుక్‌ చేశారు. అయితే అనూహ్యంగా.. ఈ ఇలా రద్దైనట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
Nagarjuna is a worried father with his son's career and personal life going sour for now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu