»   » ఆమెతో ఎఫైర్.... ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకునే వరకు వెళ్లారు!

ఆమెతో ఎఫైర్.... ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకునే వరకు వెళ్లారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్ల విషయంలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం లాంటివి తరచూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి విషయాల్లో సినీ స్టార్లు కూడా అతీతులు ఏమీ కాదు.

బాలీవుడ్ సీనియర్ స్టార్లు రిషీ కపూర్, సంజయ్ దత్ యవ్వనంలో ఉన్న సమయంలో ఓ అమ్మాయి విషయంలో గొడవ పడ్డారని... వ్యవహారం కాస్త పెద్దగా మారి ఇద్దరూ దాడి చేసుకునే వరకు వెళ్లిందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

రిషీ కపూర్ తన ఆత్మ కథ 'ఖుల్లాంఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్'లో ఈ విషయాలను వెల్లడించారు. అప్పట్లో ఓ అమ్మాయి విషయంలో రిషీ కపూర్, సంజయ్ దత్ గొడవ పడిన విషయాన్ని ఇందులో వెల్లడించారు.

 ఎవరా అమ్మాయి?

ఎవరా అమ్మాయి?

అప్పట్లో వీరి మధ్య జరిగిన గొడవ గురించి... గుల్షన్ గ్రోవర్ ముంబై మీడియాతో వెల్లడించారు. అప్పట్లో సంజయ్ కి టీనా మునిమ్ అనే అమ్మాయితో ఎఫైర్ ఉండేది. అప్పటికీ ఇంకా పెళ్లి కాని చింటూ(రిషీ కపూర్) టీనాతో సన్నిహితంగా ఉండటాన్ని సంజయ్ తట్టుకోలేక పోయాడు అని వెల్లడించారు.

 ఇద్దరం కలిసి దాడి చేయడానికి వెళ్లాం

ఇద్దరం కలిసి దాడి చేయడానికి వెళ్లాం

అప్పట్లో సంజయ్,నేను చాలా క్లోజ్ గా ఉండే వారం. ఓసారి సంజయ్ నా దగ్గరికి వచ్చి చింటూపై దాడి చేయాలని అన్నాడు. వెంటనే ఇద్దరం కలిసి చింటూపై దాడి చేందుకు వారి ఇంటికి వెళ్లాం. అపుడు చింటూ ఫియాన్సీ నితూజీ అడ్డు పడి చింటూకి టీనాతో ఎఫైర్ లేదని చెప్పడంతో సజయ్ కూల్ అయ్యాడు, గొడవ సద్దుమనిగింది అని గుల్షన్ గ్రోవర్ వెల్లడించారు.

 విధి విచిత్రం అంటే ఇదే

విధి విచిత్రం అంటే ఇదే

విధి విచిత్రం అంటే ఇదేనేమో..? ఒకప్పుడు తన తండ్రిపై దాడి చేయాలనుకున్న సంజయ్ దత్ జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న సినిమాలోనే రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 టబు పాత్ర కూడా ఉందా?

టబు పాత్ర కూడా ఉందా?

ఒకప్పుడు సంజయ్ దత్ నటి టబుతో కూడా ఎఫైర్ నడిపినట్లు ప్రచారం ఉంది. సంజయ్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన రోల్ కూడా ఉందేమోనని నటి టబు భయ పడుతోందట. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటిస్తుండగా.... జర్నలిస్టు పాత్రలో అనుష్క శర్మ, సంజయ్ దత్ తో ఎఫైర్ ఉన్న నటి పాత్రలో సోనమ్ కపూర్ నటిస్తోంది.

English summary
Gulshan Grover told DNA that Sanjay almost beat up Rishi over a suspected affair. "It's true, Sanju (Sanjay Dutt) was having an affair with Tina Munim (Ambani) at that time and thought that Chintu (who was unmarried then) was having one with her, too. Sanjay and I were like brothers so one day he told me, 'We have to go to Chintu's house to beat him up. We went to do that but his fianc©e Neetuji managed to convince us that Chintu was not having an affair so we left."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu