For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ‘తారకిజం’ కోసం క్యాంపైన్ (పోస్టర్)

  By Srikanya
  |
  White Shirt Campaign for Rabhasa
  హైదరాబాద్ : పవన్ అభిమానులంతా 'పవనిజం'అని, వర్మ అభిమానులంతా 'రామూఇజం' అని ముందుకు వెళ్తూంటే ఇప్పుడు అదే రూటులో జూ.ఎన్టీఆర్ అభిమానులు సైతం ప్రయాణం పెట్టుకున్నారు. తమ అభిమాన హీరో కోసం 'తారకిజం' క్యాంపైన్ నిర్వహించటానికి సిద్దమవుతున్నారు. ఇందుకోసం 'రభస' విడుదల రోజు ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఆ రోజున ఎన్టీఆర్ అభిమానులంతా వైట్ షర్ట్ లు వేసుకుని థియోటర్స్ కి రావాలని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారం జరుగుతోంది.

  ఈ మేరకు ఓ పోస్టర్ సైతం ప్రచారంలోకి వచ్చింది. 'Lets Wear While Shirt on the Release Day 'Rabhasa'అనే వాక్యంతో... "Time To Unite"'అనే స్లోగన్ తో ఈ క్యాంపైన్ జరుగుతోంది. జూ.ఎన్టీఆర్ డైహార్ట్ ఫ్యాన్స్ ఈ క్యాంపైన్ ప్లాన్ చేసి నిర్వహించే భాథ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇదే సందర్భంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులను సైతం కలుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది అభిమానులు వైట్ షర్ట్ లను కొనుగోలు చేసారు.

  ఇక 'రభస' విషయానికి వస్తే...

  బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు పబ్లిసిటీ క్యాంపైన్ ని సైతం పెంచారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ-''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన 'రాకాసి రాకాసి' ఈ ఆడియోకి హైలైట్ సాంగ్‌గా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఆదిలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈచిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని, విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌లో, మా బ్యానర్‌లో ఇది సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.

  టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- యూత్‌పుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రభస' ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఎన్టీఆర్ రభసలో పక్కా మాస్ లుక్‌తో వుంటారు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వుంటారు. ఎన్టీఆర్ ఈ మూడు జోన్స్‌ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా రభస. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసి అందరూ అయిదార్లుసార్లు చూసేంత ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. బెల్లం కొండ సురేష్‌గారి రేంజ్ మేకింగ్‌లో ఈ సినిమాలో కనిపిస్తుంది'' అన్నారు.

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  English summary
  Some of the ardent fans of NTR took up the mission to built the image of their favorite hero and they are spreading the slogan ‘Tarakism’. Apparently, A poster which shows NTR's picture and the message 'Lets Wear While Shirt on the Release Day 'Rabhasa'. "Time To Unite"' has been in circulation on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X