»   » ఇంతకీ... చిరంజీవి సినిమాకి డైరెక్టర్ ఎవరు..? ఎప్పుడు..?

ఇంతకీ... చిరంజీవి సినిమాకి డైరెక్టర్ ఎవరు..? ఎప్పుడు..?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తన 150వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడంటూ, ఇటీవల అమితాబ్ సమక్షంలో 'బుడ్డా' సినిమా ప్రీమియర్ సందర్భంలో, చిరంజీవి ఎంతో ఎమోషనల్ గా ప్రకటించడం అయితే ప్రకటించారు గానీ, ఆ ప్రాజక్ట్ కు సంబంధించి ఏ మాత్రం ప్రోగ్రెస్ కనపడడం లేదు. చిరంజీవి అప్పటికప్పుడు ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయం, అప్పటికే చిరంజీవి 150వ సినిమాకి తనే దర్శకుడినని మానసికంగా ఫిక్స్ అయిపోయిన మరో దర్శకుడు వివి వినాయక్ ని ఎంతగానో అప్సెట్ చేసింది. అలాగే, చిరు చిత్రానికి తానే కథకుడినంటూ చెప్పేసుకుంటున్న రచయిత చిన్నికృష్ణ కూడా ఆగమేఘాల మీద రంగంలోకి దిగిపోయాడు. నాగబాబుతో ప్రెస్ మీట్ పెట్టించేసి, ఆ సినిమాకి కథ తయారుచేస్తున్నామని ప్రకటింపజేశాడు.

  వీటికి తోడు చిరు నుంచి తనకి మళ్లీ పిలుపురాకపోవడంతో 'ఇది అయ్యే పని కాద'ని పూరీ కూడా అర్ధం చేసుకున్నాడనీ, అందుకే తన సినిమాల పనేదో తాను చేసుకుంటున్నాడనీ అంటున్నారు. అందుకే, తను చేయబోయే సినిమాల లిస్టు కూడా ప్రకటించేశాడు. అందులో చిరు సినిమా ప్రస్తావనే లేదు. ఇదిలా ఉంచితే, తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవి, అది రాకపోవడంతో బాగా అప్సెట్ అయ్యారనీ, ప్రస్తుతం ఆయనకు సినిమాల పట్ల కూడా ఆసక్తి లేదనీ ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు చిరు 150 వ సినిమా సెట్స్ కి వెళుతుందా? వెళితే దర్శకుడెవరు? అన్నవి పెద్ద సస్పెన్స్ గానే మిగిలిపోతున్నాయి!

  English summary
  Puri Jagannath made a public announcement that if Megastar Chiranjeevi rethinks on his decision of quitting movies, he would write and direct his 150th movie.But now he seems to have dropped the idea of working with megastar and concentrating on his other projects.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more