»   » 'కనుపాప' సెన్సార్ కాకుండా అడ్డుపడుతున్న ఆ పెద్ద నిర్మాత?

'కనుపాప' సెన్సార్ కాకుండా అడ్డుపడుతున్న ఆ పెద్ద నిర్మాత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ సినిమానే రిలీజ్ కావాలని, వేరే వాళ్ల సినిమాలు ఫ్లాఫ్ కావాలని కోరుకునే నిర్మాతలు ఉన్నారు. అందరూ పైకి గొప్పగా అందరు చల్లగా ఉండాలనే మాటలు చెప్పినా, వెనక మాత్రం గోతులు తీస్తూంటారు. తాజాగా అలాంటి సీన్ నే ఓ పెద్ద నిర్మాత క్రియేట్ చేసారని సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.

వివరాల్లోకి వెళితే...మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఒప్పం చిత్రం తెలుగు కనుపాప టైటిల్ తో డబ్బింగ్ అయ్యి విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని పిభ్రవరి 3వ విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డబ్బింగ్ చిత్రం కావటంతో త్రివిండ్రమ్ లో ఈ చిత్రం సెన్సార్ జరగవలిసి ఉంది. ఈ మేరకు జనవరి 24 ఉదయం అంటే నిన్నటి రోజు ఏర్పాట్లు జరిగాయి.

అందుకోసం చెన్నై క్యూబ్ ఆఫీస్ నుంచి హార్డ్ డిస్క్ త్రివేండ్రమ్ బయిలు దేరింది. కరెక్టుగా షో స్టార్టవుతుంది అని సెన్సార్ వారు అంతా వచ్చి రెడీగా ఉన్న సమయానికి ఆ హార్డ్ డిస్క్ పనిచేయకుండా పోయింది. అందులో డేటా ఏమీలేదు. మొత్తం డ్యామేజ్ అయిన హార్డ్ డిస్క్ ఉంది. దాంతో కనుపాప టీమ్ షాక్ అయ్యింది. ఒప్పం మళయాళ నిర్మాతలు ఈ విషయమై క్యూబ్ వారిని సంప్రదించగా..ఏం జరిగిందో తమకేమీ తెలియలేదని చేతులు ఎత్తేసారట.

who is behind censor problem for kanupapa?

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఇలా హార్డ్ డిస్క్ కు ఇలా జరగి, సెన్సార్ ఆగిపోవటం వెనక ఓ పెద్ద తెలుగు నిర్మాత హస్తం ఉందని చెప్పుకుంటున్నారు. ఆ నిర్మాత ఎవరనేది చెప్పటానికి ఇష్టపడకపోయినప్పటికీ, ఓ డబ్బింగ్ సినిమాతో పోటీ ఏమిటని అందరూ షాక్ అవుతున్నారు. కనుపాప చిత్రం తమ చిత్రానికి పోటీ అవుతుందని భావించి ఇలా చేసారా..లేక మరో కారణంతో చేసారా అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.

who is behind censor problem for kanupapa?

అయితే క్యూబ్ వాళ్లు మాత్రం అది వైరస్ ఎటాక్ అని, డామేజ్ అయ్యిందని చెప్తున్నారట. ఏదైమైనా ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తమ సినిమా నిలబడటం కోసం ఎంతకైనా తెగించే వారిని చూస్తే చీదిరించుకోబుద్దేస్తుంది. అయితే ఈ విషయంలో ఎంతవరకూ నిజం ఉందనేది చూడాలి.

English summary
At trivandrum censor office kanupapa censor of telugu dubbing malayalam film oppam was scheduled on 24th January morning. As the show to be started the hard disk containing the moive content was damaged and file was deleted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu