»   » చిరు ని టార్గెట్ చేసిన నట్టికుమార్ వెనక ఎవరు?

చిరు ని టార్గెట్ చేసిన నట్టికుమార్ వెనక ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న చిత్రాలతో పెద్ద నిర్మాతగా ఎదిగిన నట్టికుమార్ రీసెంట్ గా చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పరశ్రమ వర్గాల్లోఈ హాట్ టాపిక్ గా మరో విధమైన మలుపు తీసుకుంది. నట్టికుమార్ హఠాత్తుగా చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇలా డిమాండ్ చేయటం వెనక ఎవరు ఉన్నారనే అంశంపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా దాసరి నారాయణరావు పేరు ని ఎక్కువగా ప్రస్దావిస్తున్నారు. దాసరి ప్రోత్సాహంతోనే నట్టికుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణంగా గతంలో చిరంజీవి, దాసరి మధ్య వచ్చిన స్పర్ధలు,కొనసాగుతున్న వివాదాలను ఉదహరిస్తున్నారు.

నిర్మాతల మండలి, కార్మికులు, 24 క్రాప్ట్స్ మధ్య జరిగిన అంశాలు తెలియజేయడానికి నట్టికుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లో... దాదాపు 80 కోట్ల రూపాయలు ఫ్లాప్ సినిమాల రూపంలో బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ముఖ్యంగా కొమురం పులి, ఆరెంజ్, ఖలేజా చిత్రాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారు. నిర్మాతకు కూడా నష్టాలు వాటిల్లాయి. ఈ సంవత్సరం ఈ మూడు చిత్రాల ద్వారా అనేకమంది బతుకులు నాశనమయ్యాయి. గతంలో కూడా జానీ చిత్రం ఇలాగే జరిగితే డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది.

ఎగ్జిబిటర్లు అందరూ కలిసి నష్టం వస్తున్న హీరోల సినిమాలు ప్రదర్శించమని తీర్మానం చేసుకోబోతున్నారు. ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్లను నష్టపోయేలా చేసారు. హీరోల మార్కెట్‌ను బట్టి బడ్జెట్‌ను పెట్టండి. మీకు సినిమాలు తీయడం చేతకాకపోతే మా దగ్గర నేర్చుకోండి లేకపోతే చిత్రాలు తీయకండి. కొమురం పులి, ఆరెంజ్ చిత్రాల ద్వారా నష్టపోయిన ఎంతోమందికి హీరో చిరంజీవి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కనుక సమాధానం చెప్పాలని మేం కోరుతున్నాం. లేకపోతే ఈ విషయంపై నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడమని తెలిపారు. త్వరలోనే పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం తొలగిపోవాలని పలువురు సినీ కార్మికులు కోరుకుంటున్నారు అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu