»   » సుక్కు వెనుక వాళ్లే..అందుకే స్టార్స్ సిద్దం

సుక్కు వెనుక వాళ్లే..అందుకే స్టార్స్ సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తో చేసిన '1-నేనొక్కిడినే'చిత్రం చేసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవటంతో సుకుమార్ కెరీర్ కు ఇబ్బంది వచ్చినట్లే అన్నారు. మహేష్ వంటి స్టార్ తో చేసిన సినిమా ప్లాప్ అయిన ఏ దర్శకుడుకి అయినా తర్వాత పెద్ద హీరోతో చిత్రం రావటం కష్టమే. అయితే ఎన్టీఆర్ పిలిచి మరీ ‘నాన్నకు ప్రేమతో' సినిమా ఇచ్చారు. దీనికి కారణం ..సుకుమార్ వెనక ఓవర్ సీస్ ఆడియన్స్ ఉండబట్టే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ మార్కెట్ ఉంటుంది. ప్రక్క తమిళనాడులో మార్కెట్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూంటాయి. అయితే ఓవర్ సీస్ ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రతీ హీరోకు ఉంటుంది. అందుకోసం సుకుమార్ వంటి దర్శకులు తప్పనిసరి అంటున్నారు. సుకుమార్ సినిమాలకు ఇక్కడ కన్నా అక్కడే బాగా ఆదరణ ఉంది. ముఖ్యంగా యుఎస్ లో సుకుమార్ సినిమాలకు మంచి స్పందన ఉంది.

దాంతో ఓవర్ సీస్ లో మంచి బిజినెస్ జరుగుతోంది. దానికితగినట్లే సుకుమార్ కూడా చాలా స్టైలిష్ గా ఎక్కువ లండన్ వంటి ప్రాంతాల్లోనే సినిమాను రూపొందిస్తున్నారు. సుకుమార్ ఇంటిలిజెంట్ ధాట్స్ కు, సైన్స్ తో కూడిన సీన్స్ కు అక్కడ మంచి అప్లాజ్ వస్తోంది. సుకుమార్ కూడా ఓవర్ సీస్ లో తన సినిమాలు బాగా ఆడటాన్ని ఒప్పుకున్నారు.

Who is behind Sukumar?

ప్రస్తుతం నాన్నకు ప్రేమతో చిత్రం కూడా అమెరికాలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఒక మిలియన్‌డాలర్ల కలెక్షన్‌ను అధిగమించింది.

ఈ సంవత్సరంలో తక్కువ సమయంలో మిలియన్‌ మార్క్‌ చేరిన తొలి సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. చిత్ర ఓవర్‌సీస్‌ పంపిణీదారు సినీ గెలాక్సీ ఇన్‌కార్పొరేషన్‌ ఈ వివరాలను ప్రకటించింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.

ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

English summary
Sukumar openly admitted the role of overseas audiences for being fortunate to be getting big films even after flops.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu