twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రముఖులకు మరో పదవి.. కీలక ప్రకటన చేయనున్న జగన్

    |

    ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఎంతో మంది సినీ ప్రముఖులు

    ఎంతో మంది సినీ ప్రముఖులు

    సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సినీ ప్రముఖులు చేరారు. కమెడియన్ పృథ్వీ రాజ్, పోసాని కృష్ణ మురళి, భాను చందర్, జీవిత, రాజశేఖర్, అలీ, జయసుద, మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబం, కృష్ణుడు, ఫిష్ వెంకట్, యాంకర్ శ్యామల ఆమె భర్త, యువ హీరో తనీష్ తదితరులు ఆ పార్టీ తరపున ప్రచారం చేయడం.. గెలుపునకు కృషి చేయడం చేశారు.

    పృథ్వీకి కీలక పదవి

    పృథ్వీకి కీలక పదవి

    వైసీపీలో చేరిన నాటి నుంచే అప్పుడప్పుడూ ప్రెస్‌మీట్లు పెడుతూ.. అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించేవారు పృథ్వీ. దీంతో
    ఎన్నికలకు ముందు ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసిన జగన్.. తాజాగా మరో పదవితో గౌరవించారు. అదే.. అత్యంత ముఖ్యమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవి. దీనిని పృథ్వీ రాజ్‌‌కు కేటాయించారు ఏపీ సీఎం.

     అలీకి ఎమ్మెల్సీ పదవి.?

    అలీకి ఎమ్మెల్సీ పదవి.?

    ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వాళ్లలో ప్రముఖ కమెడియన్ అలీ ఒకరు. అటు జనసేనతోనూ.. ఇటు తెలుగుదేశంతోనూ టచ్‌లో ఉన్న ఆయన ఊహించని విధంగా ఫ్యాన్ కిందకు చేరిపోయారు. ఆ సమయంలో తనకు మంత్రి కావాలని ఉందని, ప్రస్తుతం అవకాశం లేని కారణంగా పోటీ చేయలేకపోతున్నాని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై వైసీపీ నుంచి ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఎవరికి..?

    ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఎవరికి..?

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పదవికి ప్రముఖ నిర్మాత, అప్పటి తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ పదవిని ఎవరికి కేటాయించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

    జగన్ టేబుల్‌పై కొందరి పేర్లు

    జగన్ టేబుల్‌పై కొందరి పేర్లు

    అంబికా కృష్ణ రాజీనామా చేయడంతో ఖాళీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవిని త్వరలోనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఈ పదవి కోసం కొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

    Read more about: ali prudhvi raj ap govt అలీ
    English summary
    Andhrapradesh Chief Minister Y. S. Jaganmohan Reddy Was Plan To Fill Another Nominated Post In The State. This Is APFDC Chairman Post. In This Post Fill With One Of The Cine Celebrity In Ycp. Many Artits supports YSR Congress Party And Joined befor Last Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X