»   » స్టార్ డైరక్టర్లు ,హీరోలు బ్రహ్మానందం ని బ్యాన్ చేసారా?

స్టార్ డైరక్టర్లు ,హీరోలు బ్రహ్మానందం ని బ్యాన్ చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గమనిస్తే రీసెంట్ గా రిలీజైన పెద్ద తెలుగు సినిమాల్లో (బాహుబలి, శ్రీమంతుడు) బ్రహ్మానందం కనిపించ లేదు. ఆ మధ్యన రిలీజయ్యే ప్రతీ సినిమాలోనూ ఆయన తప్పనిసరి అన్నట్లు ఉండేవారు. అయితే సీన్ మారింది. శ్రీను వైట్ల తో వచ్చిన ఈ ట్రెండ్ మళ్లీ కాస్త తప్పినట్లు కనిపిస్తోంది.

బ్రహ్మానందం అడపాదడపా కనపడినా ఆయన పాత్ర చాలా చిన్నదిగా ఉంటోంది. అంతేకాదు రాబోయే పెద్ద సినిమా రుద్రమదేవి లోనూ ఆయన లేరు. త్రివిక్రమ్, అల్లు అర్జన్ తో చేసిన సన్నాఫ్ సత్యమూర్తిలో తప్ప ఆయన ఏ పెద్ద చిత్రంలోనూ కనపడలేదు. అంతెందుకు కామెడీ ఎంటర్టైనర్ గా సాగిన కళ్యాణ్ రామ్ పటాస్ లోనూ, పూరి జగన్నాధ్ టెంపర్ లోనూ ఆయన లేరు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బ్రహ్మానందం చివరి హిట్ లౌక్యం. అందులో ఆయనది పెద్ద పాత్ర కాదు.ఆయన నటించిన దోచేయ్, పండుగ చేస్కో చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం యావరేజ్ అయ్యింది. ఇప్పుడు బ్రహ్మానందం ఆశలన్నీ రవితేజ హీరోగా వస్తున్న కిక్ 2 పైనే ఉన్నాయి. ఆ చిత్రం హిట్ అయితే ఆయన కెరీర్ కి బూస్ట్ అవుతుంది.

Why Brahmanandam not in recent Big Movies?

అలాగే శ్రీను వైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ బ్రహ్మానందం సెకండాఫ్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దసరాకు రిలీజయ్యే ఈ చిత్రం మళ్ళీ బ్రహ్మానందం కు వెలుగు తీసుకు రావచ్చు.

అయితే పెద్ద సినిమాల్లో బ్రహ్మానందం కనపడకపోవటం ఆశ్చర్యకరమే. పెద్ద సినిమాల ప్యాకేజ్ లో చాలా కాలం నుంచీ బ్రహ్మానందం తప్పనిసరిగా ఉంటూ వస్తున్నారు. కాకపోతే బ్రహ్మానందం ను పెట్టి కామెడీకి ఎక్కు వ ప్రయారిటీ ఇస్తే...సినిమా హిట్టైనా ఆ క్రెడిట్ బ్రహ్మానందంకే వెళ్లిపోతుందని హీరోలు, దర్శక,నిర్మాతలు భావించి దూరం పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఏది నిజమో ఎవరికి ఎరుక.

English summary
Except Trivikram's S/O Satyamurthy (SOS), Brahmanandam hasn't had a decent release this year. Unfortunately he couldn't get a place in Puri Jagannadh's Temper or Kalyan Ram's Pataas, Mahesh's Srimanthudu, Rajamouli's Baahubali.
Please Wait while comments are loading...