»   » దాసరి అంత్యక్రియలకు చిరంజీవి మిస్సింగ్.. కారణం అదేనా..

దాసరి అంత్యక్రియలకు చిరంజీవి మిస్సింగ్.. కారణం అదేనా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. వారిమధ్య ఎన్ని విభేదాలు బయటకు కనిపించినప్పటికీ వారి మధ్య సంబంధాలు ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాయని సినీ వర్గాల అభిప్రాయం. ఇటీవల సాక్షి యాజమాన్యం ప్రకటించిన తెలుగు శిఖరం అవార్డును అందుకోవడానికి అనారోగ్య కారణాల వల్ల దాసరి రాలేకపోయారు. ఆ అవార్డును చిరంజీవి చేతులు మీదుగా ఇప్పించాలని నిర్వాహకులు భావించారు. దాసరి అనారోగ్యం విషయాన్ని చిరంజీవి అదే వేదికపైనా వెల్లడించారు. తాజాగా దాసరి అంత్యక్రియలకు చిరంజీవి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

చైనాలో చిరంజీవి..

చైనాలో చిరంజీవి..

ఎవరూ ఊహించని విధంగా దాసరి నారాయణ రావు మంగళవారం మృతి చెందడం తెలిసిందే. దాసరి పార్థీవదేహాన్ని చివరిసారి దర్శించుకొనేందుకు చిరంజీవి రాలేకపోయారు. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి చైనా పర్యటనలో ఉన్నారు. వేసవి విహార యాత్ర కోసం వెళ్లారని ఓ వైపు వినిపించగా, మరోవైపు 80, 90 దశకాల్లో హీరో, హీరోయిన్ల భేటీ కోసం చిరంజీవి చైనాకు వెళ్లారనే వార్త కూడా వినిపించింది. అందుకే చైనా నుంచి రాలేకపోయారనే తాజా వార్త సారాంశం.

చైనా నుంచి సంతాప ప్రకటన..

చైనా నుంచి సంతాప ప్రకటన..

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి నేపథ్యంలో చిరంజీవి సంతాపం కూడా చైనా నుంచే వెలువరింది. మరి ఇంతకీ మెగాస్టార్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్లాడాని ఆరా తీయగా, ప్రతియేటా జరిగే దక్షిణాది ఎనలభైల హీరోహీరోయిన్ల సమావేశం కోసమే చిరు అక్కడకు వెళ్లినట్టుగా సమాచారం.

నటీనటులు సమావేశం కోసం..

నటీనటులు సమావేశం కోసం..

గత ఎనిమిదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఒక రోజున దక్షిణాది సీనియర్ నటనటీమణులు సమావేశం అవుతూ వస్తున్నారు. 80, 90 దశకాల్లో ఓ వెలుగువెలిగిన హీరోలు, హీరోయిన్లతో పాటు చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ లాంటి వాళ్లంతా ఈ గెట్ టూ గెదర్‌కు హాజరవుతూ వస్తున్నారు.

గతంలో చెన్నై తదితర నగరాల్లో..

గతంలో చెన్నై తదితర నగరాల్లో..

అయితే గత కొన్నేండ్లుగా సమావేశాలు దక్షిణాదిలోనే జరిగాయి. చెన్నై, హైదరాబాద్, కొచ్చి లాటి నగరాల్లో ఈ తారలు సమావేశం అవుతూ వచ్చారు. అయితే ఈ సారి చైనాలో వీరు తమ మీటింగ్ ను పెట్టుకున్నారట. అందుకే ఈ సినీతారలు అంతా చైనా వెళ్లినట్టుగా తెలుస్తున్నది. అందుకే మెగాస్టార్ తో పాటు ఈ మీటింగ్ కు వెళ్లిన వారంతా దాసరి అంత్యక్రియలకు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా చైనాకు బయలుదేరని వెంకటేశ్ తదితరులు హాజరయ్యారనే మాట వినిపిస్తున్నది.

English summary
Megastar Chiranjeevi not attended for Director Dasari Narayana Rao's last rites. This is becomes talk of the Industry. But Chiranjeevi away from the Hyderabad. He went to China for some personal reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu