»   »  మెగాస్టార్ బర్త్ డే పార్టీకి మహేష్ బాబు అందుకే రాలేదా?

మెగాస్టార్ బర్త్ డే పార్టీకి మహేష్ బాబు అందుకే రాలేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక ఇటీవల పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ మినహా టాప్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. జూ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి కారణం ఆయన తన తాజా సినిమా ‘నాన్నకు ప్రేమతో' షూటింగులో భాగంగా లండన్ లో ఉండటమే.

అయితే ఆరోజు హైదరాబాద్ లోనే ఉన్నా మహేష్ బాబు ఎందుకు రాలేదు? అనేది హాట్ టాపిక్ అయింది. చిరంజీవి బర్త్ డే మరుసటి రోజు ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్' తరుపున నిర్వహించిన ఫ్యాషన్ షోలో కూడా మహేష్ బాబు పాల్గొన్నారు. సినిమా షూటింగులు గానీ, యాడ్ ఫిల్మ్స్ షూటింగులు కానీ ఏమీ లేవు.

Why Mahesh Babu skipped Chiru 60 Bash?

అయినప్పటికీ మహేష్ బాబు హాజరు కాకపోవడానికి కారణం.... మెగా ఫ్యామిలీ నుండి పర్సనల్ ఇన్విటేషన్ అందక పోవడమే. సాధారణంగా ఇతర సెలబ్రిటీలకు పంపినట్లే ఓ ఇన్విటేషన్ మహేష్ బాబు కార్యాలయానికి ఓ ఇన్విటేషన్ మాత్రమే వచ్చింది. రామ్ చరణ్ నుండి గానీ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ నుండి గానీ పర్సనల్ కాల్ ఏమీ రాలేదట. కాల్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్లే వారని అంటున్నారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు కూడా ఇలాంటి కారణంతోనే చిరు 60 సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే... మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి శనివారం థాయిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ పుట్టినరోజు వేడుక ఉన్న నేపథ్యంలో ఆయన థాయ్ లాండ్ వెళ్లినట్లు సమాచారం. ఇక్కడి కో సుమై ఐలాండ్ లో కొడుకు పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేయనున్నారట.

English summary
film Nagar Sources say, Mega Camp hasn't personally invited Mahesh Babu and Namrata for the Mega Bash. All that was done was leaving an invitation at the Mahesh Babu Office.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu