»   » విజయ్ భాస్కర్ కి పవన్ కళ్యాణ్ నో ఎందుకంటే...

విజయ్ భాస్కర్ కి పవన్ కళ్యాణ్ నో ఎందుకంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా విజయ్ భాస్కర్ దర్సకత్వంలో లవ్ ఆజ్ కల్ రీమేక్ రూపొందుతుందని అంతా భావించారు. దానికి తగ్గట్లుగానే త్రివిక్రమ్ కూడా స్క్రిప్టు రాయటానికి ముందుకొచ్చారు. దాంతో మళ్ళీ విజయ్ భాస్కర్ కి మంచి రోజులు మొదలయ్యాయి అని అంతా భావించారు. అయితే చివరి నిముషంలో జయంత్ సీన్ లోకి వచ్చి హైలెట్ అయ్యారు. అయితే హఠాత్ పరిణామానికి కారణమేమిటీ అన్నది గోప్యంగా ఉండిపోయింది. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాని ప్రకారం విజయ్ భాస్కర్ కీ నిర్మాత గణేష్ (అఫీషియల్ బొత్సా సత్యనారాయణ) కీ రెమ్యునేషన్ వద్ద తేడా వచ్చిందని. విజయ్ భాస్కర్ తను వెలుగుతున్నప్పటి రోజులను గుర్తు పెట్టుకుని ఈ రీమేక్ వెర్షన్ కూడా భారీగా రెమ్యునేషన్ కోట్ చేసారని, దాన్ని పవన్ కళ్యాణ్ కొట్టి పారేసి, జయంత్ ని లైన్ లోకి తెచ్చారని తెలుస్తోంది. ఇక జయంత్ కూడా డెస్పరేట్ గా తెలుగులో సినిమా కోసం ట్రై చేస్తున్నారు. ఈ సమయంలో ఈ రీమేక్ సినిమా ఆయనకు ఓ మంచి రీ ఎంట్రీ లా కనిపించి పారితోషికం విషయం పట్టించుకోలేదని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu