»   » ఆ 48 గంటలు ప్రభాస్ నిద్రపోలేదట.. ఏం చేశాడో తెలుస్తే షాకే!

ఆ 48 గంటలు ప్రభాస్ నిద్రపోలేదట.. ఏం చేశాడో తెలుస్తే షాకే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాహుబలి చిత్రంలో నటించిన పాత్రధారులకు ఊహించని విధంగా అభినందనల సందేశాలు పోటెత్తుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఫోన్‌కాల్స్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశాలతో తడిసి ముద్దవుతున్నాడట.

48 గంటలు నిద్రకు దూరంగా..

48 గంటలు నిద్రకు దూరంగా..

దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందింన బాహుబలి2 రిలీజ్ తర్వాత ప్రభాస్ బిజీ అయిపోయారట. ఆ బిజీ ఎలాగంటే ఫోన్ కాల్స్ చేసి అభినందిస్తున్న సన్నిహితులకు, అభిమానులకు సమాధానమివ్వడంతోపాటు, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశాలకు రిప్లై ఇవ్వడంలో తలమునకలైపోయాడట. బాహుబలి2 విడుదల తర్వాత దాదాపు 48 గంటలపాటు నిద్ర మానేసి అభిమానులకు సమాధానమిచ్చినట్టు సమాచారం.

ఆనందంలో మునిగి..

ఆనందంలో మునిగి..

బాహుబలి విడుదల తర్వాత స్పందన చూసి ఆనందంతో పరవశించిపోతున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువగా ఇష్టపడి చేసిన సినిమా బాహుబలి2. మిర్చి విజయం తర్వాత ఏ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బాహుబలి కథపై, దర్శకుడు రాజమౌళిపై ఉన్న నమ్మకంతోనే ఐదేళ్లపాటు మరే సినిమాను ఒప్పుకోకపోయిన సంగతి తెలిసిందే.

మిస్టర్ ఫర్‌ఫెక్ట్..

మిస్టర్ ఫర్‌ఫెక్ట్..

సాధారణంగా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ ఒకేసారి ఒకే సినిమాను చేస్తాడు. పాత్ర కంట్యూనిటీ కోసం ఎలాంటి ఆఫర్నైనా తిరస్కరిస్తారనే పేరుంది. అందుకు అమీర్ ఖాన్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే పేరుంది. అమీర్ మాదిరిగానే ప్రభాస్ కూడా కేవలం పాత్ర కోసం చాలా ఆఫర్లను పక్కనపెట్టినట్టు తెలుస్తున్నది.

నిర్మాతలతో మాట్లాడవద్దని..

నిర్మాతలతో మాట్లాడవద్దని..

బాహుబలి చిత్రాన్ని చేయడానికి అంగీకరించిన తర్వాత ఇతర నిర్మాతలతో మాట్లాడవద్దని, మరే సినిమా ఆఫర్ల ప్రతిపాదనలను తన వద్దకు తీసుకురావద్దని తన మేనేజర్లకు ప్రభాస్ ముందే సూచించారట. దీన్ని బట్టి బాహుబలిపై ప్రభాస్ అంకితభావం ఎంత మేరకు ఉన్నదో అనే విషయం స్పష్టమవుతున్నది.

బాహుబలితో జాతీయ స్థాయి హోదా..

బాహుబలితో జాతీయ స్థాయి హోదా..

ఇష్టపడి చేసిన, నమ్మకం పెట్టుకొన్న బాహుబలి2 చిత్రం కూడా ప్రభాస్‌ ఆ స్థాయిలోనే ప్రభాస్‌కు హోదాను కల్పించింది. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించింది. అభిమానుల కురిపిస్తున్న ప్రేమ ప్రభాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి వస్తున్న సందేశాలతో క్షణం తీరిక లేకుండా ప్రభాస్ ఉన్నారట.

రెండురోజులుగా ఫోన్‌కాల్స్‌తో..

రెండురోజులుగా ఫోన్‌కాల్స్‌తో..

గత రెండు రోజులుగా ప్రభాస్ కేవలం తనకు వచ్చే సందేశాలకు రిప్లై ఇవ్వడం, వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సమాధానం చెబుతూ బాహుబలి2 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడట. ఆ పనిలో పడి దాదాపు రెండు రోజులపాటు నిద్ర కూడా పోలేదని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారని ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీ వార్త కథానాన్ని వెల్లడించింది.

English summary
As per inside reports, Baahubali hero Prabhas was busy taking calls and replying to messages of people congratulating him for the superb opening! He spent nearly spent 48 hours to give reply to phone calls, whatsup, SMSs. Prabhas now enjoying the success of Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu