»   » రాజమౌళి భయంతోనే ప్రభాస్ 'నో'

రాజమౌళి భయంతోనే ప్రభాస్ 'నో'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్,మెహర్ రమేష్ కాంబినేషనలో భిళ్ళా చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్ అంటూ ఓ చిత్రం తమిళంలో నిర్మితమవుతోంది.వెంకటేష్ తో ఈనాడు చిత్రం రూపొందించిన తోలేటి చక్రి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.అజిత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.దాంతో ఈ చిత్రం ఇప్పుడు రీమేక్ అవుతుందా లేదనే చర్చ తెలుగు పరిశ్రమలో మొదలైంది.

అలాగే తమిళ చిత్ర నిర్మాతలు కూడా రీమేక్ రైట్స్ అమ్మటానికే ఆసక్తి చూపుతున్నారు.డబ్బింగ్ రైట్స్ కి పెద్దగా రాదని వారి భావన.అయితే ప్రభాస్ ఇప్పుడు లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ చిత్రం చేస్తున్నాడు. అలాగే తర్వత రాజమౌళి చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చి ఉన్నాడు.దాంతో ప్రభాస్ ఈ చిత్రం ఒప్పుకోవాలంటే రాజమౌళే అడ్డుగా నిలిచే అవకాశం కనపుడుతోంది.ఎందుకంటే రాజమౌళి చిత్రానకి దాదాపు సంవత్సరం పాటు డేట్స్ అడిగాడని తెలుస్తోంది.దాంతో ప్రభాస్ నో చెప్తున్నాడని తెలుస్తోంది.

English summary
Prabhas is currently busy with Lawrence's Rebel and he will move on to Rajamouli's big budgeted flick from 2012. Rajamouli's film requires him to concentrate on that project for more than a year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu