Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎయిర్ టెల్ ...రామ్ చరణ్ ని ఎందుకు వదిలేసింది?
రామ్ చరణ్ ఇప్పుడు టాటా డొకోమో నీ ప్రమోట్ చేయటానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఎయిర్ టెల్ ని ప్రమోట్ చేసిన రామ్ చరణ్ హఠాత్తుగా ఇలా పార్టీ మార్చటానికి కారణం ఏమటనే చర్చ అందరిలో కలిగింది. అందులోనూ ఎయిర్ టెల్ ఇప్పుడున్న పెద్ద నెట్ వర్క్. అలాంటి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎందురు రామ్ చరణ్ తప్పుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. పరిశ్రమలో చెప్పుకునే దాని ప్రకారం...రామ్ చరణ్ కాంట్రాక్ట్ ఎయిర్ టెల్ తో మే 2011 కి ముగిసి పోయింది. తిరిగి రెన్యువల్ చేసుకోవటం కోసం రామ్ చరణ్ ఎక్కువ రేట్ అడగటం జరిగింది.వారు రామ్ చ రణ్ మార్కెట్ ని పరిగణనలోకి తీసుకుని కాదనటం జరిగింది. ఆరెంజ్ ప్లాప్ తర్వాత అతని మార్కెట్ డౌన్ అయ్యిందని తేల్చారు. తర్వాత మరో సినిమా వచ్చి హిట్ అయితే ఆ కథ వేరే గా ఉండేది. కాని అదేమీ జరగలేదు. దాంతో వారు రామ్ చరణ్ ని రేటు పెంచటం కష్టమని తేల్చేసారు.
ఈ లోగా ఈ విషయం తెలుసుకున్న టాటా డొకోమా వారు లైన్ కి లోకి వచ్చి ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అదీ కథ అంటున్నారు.ఇక ఈ విషయమై అల్లు శిరీష్ స్పందిస్తూ...ఎయిర్ టెల్ వారి కాంటాక్ట్ మే 2010 నుంచి మే 2011 వరకూనే. దాంతో కాంటాక్ట్ సమయం ముగిసిన తర్వాత రెన్యూవల్ కి రామ్ చరణ్ ఇష్టపడలేదు. డొకోమో మీద ఆసక్తి చూపారు అన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.