»   »  అందుకే లేటు: రామ్ చరణ్ కు సురేంద్ర రెడ్డి ట్విస్ట్

అందుకే లేటు: రామ్ చరణ్ కు సురేంద్ర రెడ్డి ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ సరసన తమిళ చిత్రం ' 'తని ఒరువన్‌'' రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం జనవరి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుందని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభం మరింత లేటు కానుంది. అందుకు కారణం సురేంద్రరెడ్డి అని తెలుస్తోంది.

రామ్ చరణ్ కి స్క్రిప్ట్ నేరేషన్ ఇవాల్సిన సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పర్శనల్ పనిమీద విదేశాలకు వెళ్ళాడని సమాచారం. సురేంద్ర రెడ్డి... నెలాఖరుకు గానీ హైదరబాద్ రాడని తెలుస్తోంది. దీంతో జనవరిలో ప్రారంభం కావాల్సిన సినిమా ఓ నెల వెనక్కి వెళ్లి ఫిబ్రవరికి లో ప్రారంభం కానుందని సమాచారం. దాంతో ఫిబ్రవరి 10న 'తనీ ఒరువన్' రీమేక్ ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.


ఇప్పటికే ఈ చిత్రానికి టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసేసారు. ఈ చిత్రానికి భజరంగి భాయీజాన్, ఏక్తా టైగర్ సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ అశీమ్ మిస్రా ని ఎంపిక చేసారు. అలాగే..సంగీత దర్శకులుగా తని ఒరువన్ కి పనిచేసిన వారే చేస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇక విలన్ గా..అరవింద్ స్వామినే ఫైనలైజ్ చేసారు. రకరకాల ఆప్షన్స్ అనుకున్నప్పటికీ అరవింద్ స్వామే ఫెరఫెక్ట్ ఛాయిస్ అనే నిర్ణయానికి వచ్చారు. ఆయన కు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఎన్ వి ప్రసాద్, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్నారు.

why Ram Charan's movie late?

' 'తని ఒరువన్‌'' కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు. ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశ. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. త్వరలోనే సినిమాని మొదలుపెడతాం అన్నారు.

English summary
RamCharan‬, ‎SurenderReddy's T‎hanioruvan‬ Remake is expected to go to floors from Feb. 10th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu