»   » 'కిక్‌-2' లేటు: నిర్మాత,దర్శకుడు మధ్య విభేదాలు..డిఫిషిట్ ??

'కిక్‌-2' లేటు: నిర్మాత,దర్శకుడు మధ్య విభేదాలు..డిఫిషిట్ ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న 'కిక్‌-2'ను విడుదల చేయనున్నట్లు కల్యాణ్‌రామ్‌ ఈ మధ్యనే తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడు నెలల క్రితమే ఆడియో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎందుకు ఇలా వాయిదా పడుతూ వస్తోంది అన్నదానికి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ కారణం వినపడుతోంది. అదేమిటంటే...

ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడటానికి కారణం కేవలం ఓవర్ బడ్జెట్ అని తెలుస్తోంది. రేసు గుర్రం పెద్ద హిట్ అవటంతో రవితేజ మార్కెట్ ని కూడా పట్టించుకోకుండా ...బడ్జెట్ ని పెంచుకుంటూ సురేంద్రరెడ్డి వెళ్లారని అంటున్నారు. ముఖ్యంగా రీషూట్ లు చేయటమే సగం కారణం అంటున్నారు. దాంతో ఈ చిత్రం 12 కోట్లు డెఫిషిట్ లో పడిందని చెప్తున్నారు. అనుకున్న స్ధాయిలో బిజినెస్ కాలేదని అందుకే ఈ డెఫిషిట్ అంటున్నారు. ఈ విషయమై దర్శకుడు, నిర్మాత మధ్య వాదోపవాదాలు జరిగి రిలీజ్ డేట్ ఫైనల్ గా ప్రకటించారని చెప్పుకుంటున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. తాజా చిత్రంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌ కీలక పాత్రధారులు. గతంలో మంచి 'కిక్‌' ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కిక్‌-2' కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. '' అని తెలిపారు.


చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి...నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ఆగస్టు 21 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


Why Ravi Teja's Kick 2 Delayed?

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.


ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Ravi Teja almost completed his next project where KICK 2 is still struggling to release.
Please Wait while comments are loading...