twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిష్ ని తాప్సీ ఎందుకు రిజెక్టు చేసింది?

    By Srikanya
    |

    వేదం, గమ్యం చిత్రాలతో ఇంటిలిజెంట్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తాజా చిత్రం రానా దగ్గుపాటి తో వందే కృష్ణ జగద్గురుమ్ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా తాప్సీ ని అడిగారు.కానీ ఆమె డేట్స్ లేవని తప్పించుకుంది. అయితే దీనికి కారణం వేరే అని చెప్తున్నారు. రానా లాంటి పొడవైన హీరో ప్రక్కన చేస్తే తాను చాలా పొట్టిగా కనపడతాననే భయమే ఆమెను వెనక్కి లాగిందని గుసగుసలు వినపడుతున్నాయి.

    ప్రస్తుతం తాప్సీ మొగుడు చిత్రంలో చేస్తోంది.కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జీ టీవీ వారు తీసుకున్నారు. ఈ ఛానెల్ వారు దాదాపు మూడు కోట్ల యాక్షై లక్షల మొత్తానికి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో తాప్సీ అందాలు వెర్రిక్కించేలా ఉండటం సినిమాపై నమ్మకం పెంచే ఆ మొత్తం ఇచ్చి తీసుకున్నారని మీడియో లో ఓ వర్గం వ్యాఖ్యానిస్తోంది.అంటే దాదాపు ఓ రకంగా బెట్టింగ్ అన్నమాట. ఈ మొత్తాన్ని ఛానెల్ లో వేసినప్పుడు వచ్చే యాడ్స్ ద్వారా రికవరీ చేసుకోవాలి వారు. ఇక గోపీచంద్ కి సైతం మంచి మార్కెట్ ఉండటం ట్రేడ్ లో ప్లస్ అయ్యింది.

    మరో ప్రక్క బాబూ శంకర్ అందించిన ఆడియో విడుదలై మంచి మార్కులు వేయించుకుంది. వీటిన్నట్టికి తోడు కృష్ణవంశీ బ్రాండ్ నేమ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతుంది.ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ...'మగాడు మొగుడు అనిపించుకునేది కొందరే. అలాంటి మొగుడు కథతో తీస్తున్న చిత్రమిద'ని అన్నారు. 'పదేళ్ళుగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని ఎదురుచూస్తున్నాను. అది ఇప్పటికి తీరింది అని గోపీచంద్‌ చెప్పారు. నాకున్న యాక్షన్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేస్తూ ఈ చిత్రం రూపొందించార'ని అన్నారు.

    English summary
    Krish is directing her Rana Daggupati for Krishnam Vande Jagadgurum. It was heard that Tapsee is the heroine in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X