»   » 'ఖలేజా' కోర్టుకు వెళ్ళటానకి అసలు కారణం?

'ఖలేజా' కోర్టుకు వెళ్ళటానకి అసలు కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ విషయమై నాంపల్లి కోర్టులో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అంతా సర్దుమణిగిందన్న గొడవ మళ్లీ ఎందుకు రైజ్ అయ్యిందనటానకి కారణం తెలిసింది. ఖలేజా టైటిల్ ని విజయ భాస్కర రెడ్డి అనే చిన్న నిర్మాత రిజస్టర్ చేసుకుంటే ..మహేష్ బాబు కోసం ఆ టైటిల్ వాడారు. అయితే విజయ భాస్కర రెడ్డి గొడవ చేయటంతో నిర్మాత సి.కళ్యాణ్ తెలివిగా ఆ టైటిల్ కి మహేష్..ఖలేజా అని పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసారు. దాంతో మండిన విజయ భాస్కర రెడ్డి...ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి అల్లు అర్జున్ బద్రీనాధ్ గుర్తు చేసేలా...భాస్కర్ బద్రీనాధ్ టైటిల్ నీ, బాలకృష్ణ పరమ వీర చక్ర గుర్తు చేసేలా..అశోక్ పరమ వీర చక్ర అని టైటిల్స్ చేస్తానంటూ వెళ్ళారు. దానికి ఫిల్మ్ ఛాంబర్ వారు ఈ టైటిల్స్ రిజస్టర్ చేయరాదంటూ అడ్డు పెట్టారు. కారణంగా ఇలాంటి శబ్దం వచ్చే టైటిల్స్ ఆల్రెడీ రిజస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. దాంతో తమకో న్యాయం, మహేష్ బాబుకో న్యాయం చేస్తారా అంటూ విజయ్ భాస్కర్ రెడ్డి కోర్టుకు వెళ్ళారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu