»   » నిజమైతే రామ్ చరణ్ పూర్తి రిస్క్ చేస్తున్నట్లే

నిజమైతే రామ్ చరణ్ పూర్తి రిస్క్ చేస్తున్నట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా నటించబోతున్న సినిమా 'రక్షక్' (వర్కింగ్ టైటిల్ ) తమిళ చిత్రం ''తని ఒరువన్‌'' ఆదారంగా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

రామ్ చరణ్ బ్రూస్ లీ తర్వాత కొంత కాలం ఆమెరికా వెళ్ళి రెస్ట్ తీనుకు ని వచ్చిన తర్వాత తను ఈ సినిమా పై మనసు పెట్టారు. అందుకునే కథలో సైతం మార్పులు ఉండేలా కోరుకుంటున్నారు. అందుకునే ఒరిజినల్ సినిమాలో హీరో చాలా సీరియస్ గా, విలన్ కూల్ గా ఉండే ఆ క్యారక్టర్స్ ని మార్చి ఇక్కడ రివర్స్ చేస్తున్నారు అంటే చెర్రి చాలా కూల్ గా విలన్ సీరియస్ గా వుంటారని సమాచారం.

ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ కొన్ని కామెడీ సన్నివేశాల్లో కనిపించేలా డిజైన్ చేసారంటున్నారు. అలాగే హీరోయిన్ తో లవ్ సీన్స్ ను కూడా బాగా మార్చి, మసాలా అద్దినట్లు చెప్తున్నారు. ఇవన్నీ నిజమైతే ....చక్కటి కథని నాశనం చేసినట్లే అంటున్నారు ఒరిజనల్ చూసినవారు. అలాగే రామ్ చరణ్ రిస్క్ చేస్తున్నట్లే అని చెప్తున్నారు.

Will Changes work to Ram Cherry's Remake?

ఈ చిత్రం జనవరి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసేసారు. ఈ చిత్రానికి భజరంగి భాయీజాన్, ఏక్తా టైగర్ సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ అశీమ్ మిస్రా ని ఎంపిక చేసారు. అలాగే..సంగీత దర్శకులుగా తని ఒరువన్ కి పనిచేసిన వారే చేస్తున్నారు.

ఇక విలన్ గా..అరవింద్ స్వామినే ఫైనలైజ్ చేసారు. రకరకాల ఆప్షన్స్ అనుకున్నప్పటికీ అరవింద్ స్వామే ఫెరఫెక్ట్ ఛాయిస్ అనే నిర్ణయానికి వచ్చారు. ఆయన కు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఎన్ వి ప్రసాద్, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్నారు.

''తని ఒరువన్‌'' కథేంటి...
మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి.

Will Changes work to Ram Cherry's Remake?

ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు. ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం.

English summary
Makers changed the script of ‘Thani Oruvan’ according to Ram Charan’s image.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu