»   »  చిరు పార్టీలో లేడీ అమితాబ్???

చిరు పార్టీలో లేడీ అమితాబ్???

Posted By:
Subscribe to Filmibeat Telugu


చిరంజీవి పెట్టబోటే పార్టీ పేరు స్వయంకృషిగా ప్రచారమౌతోంది. ఈ పార్టీని జనవరి 15న ప్రకటించనున్నట్టు ఒక ప్రైవేట్ టెలివిజన్ చానెల్ ప్రసారం చేసింది. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా స్వయం కృషి సినిమా రూపొంది సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన విజయశాంతి తల్లి తెలంగాణా పార్టీ పెట్టినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. చిన్నచిన్న నిరసనలతోనే విజయశాంతి కాలం వెల్లబుచ్చుతోంది. స్వయంకృషి సినిమాలో విజయశాంతి జోడి చిరంజీవి తాజాగా పెట్టబోయే పార్టీ ఆ సినిమా పేరుతోనే కావడం విశేషం.

ఇదిలా ఉంటే చిరంజీవి పార్టీ పెడితే తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. చిరంజీవి కనుక ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేస్తే ఆయనకు తెలంగాణాలో కూడా సంబంధిత వ్యక్తి కావాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి స్వయంకృషి సినిమాలో చిరంజీవి హీరోయిన్ గా చేసిన విజయశాంతి అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఆమె బిజెపి నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడుతూ తల్లి తెలంగాణా పార్టీని కూడా ప్రారంభించింది. ఆమెను తన ప్రతినిధిగా చిరంజీవి చేసుకుంటే నమ్మకానికి నమ్మకం, ప్రత్యేక తెలంగాణాకు ఆమె అనుకూలం అనే నిననాదం మొదలయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే విజయశాంతి తల్లి తెలంగాణా పార్టీ దృష్టిలో చూస్తే ఈ భావన సాధ్యం కాదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X