»   » ఎన్టీఆర్ హీరో,కళ్యాణ్ రామ్ నిర్మాత.. మరి డైరక్టర్?

ఎన్టీఆర్ హీరో,కళ్యాణ్ రామ్ నిర్మాత.. మరి డైరక్టర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాక్ తో సంభందం లేకుండా నాన్నకు ప్రేమతో చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తూండటంతో ఫైనల్ రిజల్ట్ పట్టించుకోకుండా ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులోకి ఉత్సాహంగా దూకుతున్నారు. జనతా గ్యారేజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నారు. మోహన్ లాల్ కీలకమైన పాత్రను పోషిస్తున్నఈ చిత్రం తర్వాత ఏ సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ హీరో గా తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించే చిత్రం లో నటిస్తారని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి దర్సకుడు ఎవరూ అంటే వక్కంతం వంశీ అని తెలుస్తోంది. వక్కంతం వంశీకు, ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ తెలియంది కాదు. వక్కంతం కు ఎన్టీఆర్ ..ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఇలా నిలబెట్టుకోబోతున్నట్లు సమాచారం. అలాగే కళ్యాణ్ రామ్ కీలకమైన పాత్ర ఈ సినిమాలో పోషించే అవకాసం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. నిజమైతే ఈ ప్రాజెక్టు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.

will Kalyan Ram Produce Ntr's next?

ఇక..సంక్రాంతి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ఎక్కడా వెనక పడకుండా కలెక్ట్ చేసింది. టాక్ కు సంభంధం లేకుండా వస్తున్న కలెక్షన్స్ కు టీమ్ అంతా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ పండుగ సీజన్, వీకెండ్ అయిపోయేసరికి 38.57 షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 54 కోట్లు అయ్యాయ. దాంతో మరో పదిహేను కోట్లు వస్తే కాని బ్రేక్ ఈవెన్ రాదని లెక్కలు వేస్తున్నారు. కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ కాస్త తగ్గుమొహం పట్టడం, ముఖ్యంగా బి,సి సెంటర్లలలో ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా కనపడటం ఇబ్బందికి గురి చేస్తోంది.

English summary
Junior NTR will be the hero and Kalyan Ram is to produce the movie on NTR Arts Banner most likely to be directed by Vakkantham Vamsy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu