»   » 'చిరు'ను వదిలేసి బాలయ్యను ఫాలో అవుతున్న రామ్ చరణ్!?

'చిరు'ను వదిలేసి బాలయ్యను ఫాలో అవుతున్న రామ్ చరణ్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

1980లలో బాలకృష్ణ హీరోగా పరిచయం అయిన వెంటనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ సరసన సటించిన హీరోయిన్ లతో తాను జోడికట్టనని బాలయ్య తెలిపాడు. ఈ మాటలను బాలయ్య నిలబెట్టుకున్నాడు కూడా. తాజాగా ఇదే బాటలో తన తండ్రి చిరంజీవి సరసన నటించిన కథానాయిక లతో తాను నటించనని రామ్ చరణ్ అంటున్నాడట. ఈ విషయంలో బాలయ్యను చరణ్ ఫాలో అవుతున్నాడని చిత్ర పరిశ్రమ అంటోంది. సో స్టాలిన్ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన త్రిష రామ్ చరణ్ లిస్ట్ లో లేనట్టే!

ఇక ప్రస్తుతం రామ్ చరణ్, భాస్కర్ దర్శకత్వంలో 'ఆరంజ్" ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఇందులో జెనీలియా కథానాయికగా నటిస్తోంది, ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకొంటోంది. రామ్ చరణ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకొని వచ్చేనెల హైదరాబాద్ కు రానున్నారు. అదేవిధంగా బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సింహా" చిత్రంలో నటిస్తూ మైసూర్ లో బిజిగా ఉన్నాడు. బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత లు కథానాయికలుగా నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu