»   » టాలీవుడ్‌కు సాయిపల్లవి టాటా? అందుకు కారణం అదేనా!

టాలీవుడ్‌కు సాయిపల్లవి టాటా? అందుకు కారణం అదేనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
టాలీవుడ్‌కు సాయిపల్లవి టాటా? కారణం అదేనా!

ఫిదా చిత్రంతో తెలుగు తెరపై మెరుపులా మెరిసింది సాయి పల్లవి. ఆమె డాన్సులకు, నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. సావిత్రి లాంటి నటీమణులకు వారసురాలు అని సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. ఓవర్‌నైట్‌లోనే స్టార్ హీరోయిన్ అనే పేరును సంపాదించుకొన్నది. ఫిదా తర్వాత సాయి పల్లవి దిల్ రాజు బ్యానర్‌లోనే ఎంసీఏ అనే చిత్రంలో నానితో నటిస్తున్నారు. అయితే తనకు వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

 సాయి పల్లవికి యమా క్రేజ్

సాయి పల్లవికి యమా క్రేజ్

ఫిదా తర్వాత సాయి పల్లవికి టాలీవుడ్‌లో యమా క్రేజ్ వచ్చింది. ఎవరి నోటా చూసిన అమ్మాయి బాగా చేసింది అని సాయి పల్లవి నటన గురించి గొప్పగా చెప్పుకొన్నారు. ఇక టాలీవుడ్ తెర మీదే కాదు. దక్షిణాదిలో దుమ్ము దులపడం ఖాయమనే అంతా భావించారు. కానీ ఫిదా తర్వాత తెలుగులో గొప్పగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు.

నాని సరసన ఎంసీఏలో

నాని సరసన ఎంసీఏలో

తెలుగులో ప్రస్తుతం నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నానితో సమానంగా పోటీ పడుతూ సాయిపల్లవి అద్భుతంగా నటిస్తున్నదనే విషయాన్ని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నానికి సాయి పల్లవికి గొడవ

నానికి సాయి పల్లవికి గొడవ

అయితే ఎంసీఏ షూటింగ్‌లో నానికి సాయి పల్లవికి గొడవ జరిగినట్టు రూమర్లు మీడియాలో వెలుగుచూశాయి. దాంత వారి మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుకొన్నట్టు ప్రచారమయ్యాయి. అయితే దిల్ రాజు వారి మధ్య విబేధాలను పరిష్కరించినట్టు తెలిసింది.

 కరు, మారి2 చిత్రాలకు ఒకే

కరు, మారి2 చిత్రాలకు ఒకే

ఫిదా తర్వాత తెలుగులో కాకుండా తమిళంలో కరు, మారి2 చిత్రాలను అంగీకరించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఎంసీఏ చిత్రం తర్వాత తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజా సమాచారం.

 సున్నితంగా తిరస్కరించినట్టు

సున్నితంగా తిరస్కరించినట్టు

మరి కొందరు నిర్మాత, దర్శకులు సంప్రదించగా వారిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. మంచి స్క్రిప్టు అంటూ కొందరు ఇవ్వడానికి ప్రయత్నించగా ఆసక్తి చూపలేదన్నట్టు తెలుస్తున్నది. కొందరు నిర్మాతలైతే బ్లాక్ చెక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉనవాళ్లు ఉన్నారు. అయితే స్క్రిప్టులు నచ్చలేక ఒప్పుకోవడం లేదా తెలుగులో సినిమాలు చేయడం ఇష్టం లేదా అనే విషయం చర్చనీయాంశమవుతున్నది.

 తెలుగు మార్కెట్‌ను పెంచుకొనే

తెలుగు మార్కెట్‌ను పెంచుకొనే

టాలీవుడ్ చిత్రాలను సాయి పల్లవి అంగీకరించకపోవడం వెనుక ఏం కారణమై ఉంటుంది అనే చర్చనీయాంశమైంది. తమిళ, మలయాళ చిత్రాలను చేస్తూ తెలుగులో మార్కెట్‌ను పెంచుకొనే ఆలోచనలో ఉందా అనే మరో ప్రశ్నగా మారింది. ఒకవేళ అదే నిజమైతే తెలుగు దర్శక, నిర్మాతలకు సాయి పల్లవితో సినిమాలు చేయడం కష్టమైన పనిగానే కనిపిస్తున్నది.

 ధనుష్‌తో కలిసి మారి2

ధనుష్‌తో కలిసి మారి2

తమిళంలో ధనుష్‌తో కలిసి మారి2 అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకుడు బాలాజీ మోహన్. వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏల్ విజయ్ చిత్రం కరు తర్వాత సాయి పల్లవికి తమిళంలో ఇది రెండో చిత్రం.

వైద్యవృత్తిపై సాయిపల్లవి

వైద్యవృత్తిపై సాయిపల్లవి

మలయాళంలో ప్రేమమ్ తర్వాత సాయి పల్లవి జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే సినిమాలను తగ్గించుకొంటూ వైద్యవృత్తిపై దృష్టిపెట్టనున్నదా అనే సందేహం కూడా వ్యక్తమవుతున్నది. డాక్టర్ వృత్తిని కొనసాగించడానికి సినిమాలను తగ్గించుకుంటుందా అనే ప్రశ్నకు సాయి పల్లవి సమాధానమిస్తే కన్‌ఫ్యూజన్‌కు తెరదించినట్టు అవుతుంది.

English summary
Maari 2 just got bigger! The makers have announced that it will be a bilingual, shot in Tamil and Telugu and also, Fidaa girl Sai Pallavi will be the heroine for the project. In a tweet, director Balaji Mohan revealed that Sai Pallavi will be playing a character that is essential to the movie. Apart from this Sai Pallavi doing a Telugu movie MCA with Nani. Other Than this movie, She have not accepted any movie so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu