»   » శ్రీదేవి కూతురు ఎంట్రీ ఆ పెద్ద దర్శకుడుతో..?

శ్రీదేవి కూతురు ఎంట్రీ ఆ పెద్ద దర్శకుడుతో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Will Sridevi’s daughter Jhanvi Kapoor make her film debut soon?
హైదరాబాద్ :తాజాగా మరోసారి ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి వార్తల్లోకెక్కింది. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో జాహ్నవి బాలీవుడ్‌కి పరిచయం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కరుణ్ జోహార్ తో బోనీ కపూర్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక,నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

మరోవైపు తన తల్లిలాగే తెలుగులో ఆమె కెరీర్‌ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు. తెలుగులో యంగ్ హీరోల సరసన ఆమెను అడుగుతున్నారని సమాచారం. జాహ్నవి నటించిన సినిమా అంటే ఆ క్రేజే వేరు. దాంతో ఆమె ఎంట్రీ తమకు అంటే తమకు దక్కాలని అంతా పోటీలు పడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగే పలుమార్లు వార్తలొచ్చినా... తన కూతురు ఇప్పుడే సినిమాల్లోకి రాదని శ్రీదేవి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. జాహ్నవి చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్‌ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది.

ప్రస్తుతం జాహ్నవి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. సంభాషణలు ఎలా పలకాలో కూడా తెలుసుకొంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే జాహ్నవి సినిమాల్లోకి వచ్చే విషయంపై బోనీకపూర్‌ దంపతులు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు జాహ్నవి తండ్రి బోనీ కపూర్‌ను ఈ విషయమై సంప్రదించినట్లు సమాచారం. అయితే శ్రీదేవి-బోనీ కపూర్ తమ కూతురును ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి పంపడం ఇష్టం లేదని తేల్చి చెప్పినట్ల తెలుస్తోంది. జాహ్నవికి సొంతగా నిర్ణయాలు తీసుకునే వయసొచ్చాక ఆమె ఇష్ట ప్రకారం సినీరంగంతో లేదా ఇతర ఏ రంగంలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, జాహ్నవి చదువులు పూర్తయిన తర్వాత ఏదైనా అని స్పష్టం చేస్తున్నారట.

ఈ మధ్య జాహ్నవి తరచూ తల్లితో కలిసి పలు ఫ్యాషన్ షోలలో, వివిధ సినిమా ఫంక్షన్లలో పాల్గొనడం, తన సెక్సీ ఆటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె వ్యవహారం చూస్తుంటే.....మోడలింగ్, ఫ్యాషన్ రంగం, సినిమా రంగంలో ఏదో ఒక రంగాన్ని జాహ్నవి ఎంచుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

English summary
From dance and diction classes to sweating it out at the gym, Boney Kapoor Sridevi’s older daughter Jhanvi Kapoor is leaving no stone unturned to see that she makes her filmi debut in full form. Rumour mills were abuzz with news that the gal would make her debut in a Karan Johar film. Our buddie the birdie insists that KJo has assured Sri and Boney that he will launch Jhanvi, but only when the time is right. But Jhanvi’s protective mother has always made it very clear that her daughter won’t be seen on the big screen too soon, at least not before she is done with her education.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu