»   » ఈ హిట్ పెయిర్...మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

ఈ హిట్ పెయిర్...మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ పరిశ్రమ పుట్టిన నాటి నుంచీ హిట్ పెయిర్ కి ఆదరణ ఉంటూ వస్తోంది. హిట్ పెయిర్ ఉందంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాలు దర్శక,నిర్మాతల్లో ఉంటాయి. అదే కోణంలో ఇప్పుడందరి దృష్టీ జూన్ 27న విడుదల కానున్న ఆటోనగర్ సూర్య చిత్రం పై ఉంది. అందులో నటించిన సమంత, నాగచైతన్య గతంలో మనం, ఏమి మాయ చేసావే చిత్రాల్లో కలిసి నటించారు. ఆ రెండు చిత్రాలు డీసెంట్ హిట్. దాంతో ఈ సారి ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా హిట్ పెయిర్ మంత్రం భాక్సాఫీస్ వద్ద పనిచేస్తుంది అంటున్నారు.

ఈ సందర్భంగా దేవా కట్టా చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆత్మాభిమానానికి, ఆత్మవంచనకు...మనిషి విలువకు, పశుబలానికి నడుమ జరిగే పోరాటంలో మంచే జయిస్తుందని బలంగా విశ్వసించే యువకుడి కథే ఆటోనగర్ సూర్య.నాగచైతన్య గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో కనిపిస్తాడు. అతడి కెరీర్‌లో ప్రత్యేక చిత్రమవుతుంది అన్నారు.

అచ్చిరెడ్డి చిత్రం గురించి మాట్లాడుతూ ' ఈ చిత్రంలో నాగచైతన్య క్లాస్ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో మరో హిట్ మూవీ అవుతుంది. అలాగే 'ప్రేమ కావాలి', 'పూలరంగడు' చిత్రాల తరువాత మా బేనర్‌కి 'ఆటోనగర్ సూర్య' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

Will the hit pair Repeat the magic

ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

English summary
Naga Chaitanya and Samantha are the current hit pair in Tollywood with two hits in a row including Ye Maya Chesave and Manam. Now, the duo long awaited film Autonagar Surya is slated for June 27th release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu